హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్.. అందుకు నిదర్శనం ఈ లెక్కలు..

Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్.. అందుకు నిదర్శనం ఈ లెక్కలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Har Ghar Tiranga: ప్రజలందరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ప్రోగ్రామ్‌ను విజయవంతం చేశారు. ప్రభుత్వం పిలుపుమేరకు మువ్వన్నెల జెండా ఇంటిపై ఎగరేసి సెల్ఫీలు కూడా హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌కి పంపించారు.

ఇంకా చదవండి ...

భారతదేశానికి స్వాతంత్ర్యం (Freedom) వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా భారత పౌరులు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) జరుపుకున్నారు. ప్రజలందరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ప్రోగ్రామ్‌ను విజయవంతం చేశారు. ప్రభుత్వం పిలుపుమేరకు మువ్వన్నెల జెండా ఇంటిపై ఎగరేసి సెల్ఫీలు కూడా హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌కి పంపించారు. అయితే 'హర్ ఘర్ తిరంగా' ప్రచార వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఏకంగా ఐదు కోట్లకు పైగా తిరంగా సెల్ఫీలు (Selfies) అప్‌లోడ్ అయ్యాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. దీనిని అద్భుతమైన విజయంగా అభివర్ణించింది

* ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రారంభించిన కేంద్రం

భారతదేశం తన 76వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని స్వాగతించిన ఆగస్టు 15, 2022 వరకు ప్రజలు వేడుకలు ఘనంగా చేసుకున్నారు. మరోవైపు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 22, 2022న ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

దాంతో ఈ ఉత్సవంలో కోట్లాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాదు, ఇంటిపై సగర్వంగా ఎగరేసిన త్రివర్ణ పతాకంతో సెల్ఫీ దిగి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అలా పంపిన సెల్ఫీల సంఖ్య సోమవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఐదు కోట్లకు చేరింది. దాంతో "భారతదేశ చరిత్రలో ఈ ప్రత్యేక సాధించడంలో భారతదేశం, ప్రపంచం అంతటా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

* 75 వారాల ముందుగా ప్రారంభమైన ఉత్సవం

75 సంవత్సరాల స్వాతంత్ర్య సంస్మరణ మార్చి 12, 2021న 75 వారాల కౌంట్‌డౌన్‌గా ప్రారంభమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది భారతదేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్. ఇది 2023 ఆగస్టు 15న ముగుస్తుంది. "జాతీయ జెండాతో మరింత వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి అంకితమైన ప్రోగ్రామ్‌ హర్ ఘర్ తిరంగా.

అమృత్ కాల్ సమయంలో దేశ నిర్మాణానికి నిబద్ధతగా ఇంట్లో లేదా వర్క్ ప్లేస్‌లో జెండాను ప్రదర్శించాలని భారతీయులను ఈ ప్రోగ్రామ్‌ అభ్యర్థించింది." మంత్రిత్వ శాఖ అని చెప్పింది. హైబ్రిడ్ ఫార్మాట్‌లో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ భారతీయులు జాతీయ జెండాతో భౌతిక, భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించేలా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలానే ప్రత్యేక వెబ్‌సైట్‌లో సెల్ఫీని అప్‌లోడ్ చేయడం ద్వారా కలిసికట్టుగా వేడుకలు, దేశభక్తి ఉత్సుకతను పెంపొందించుకోవాలని భావించినట్టు పేర్కొంది.

ఈ ఘనత సాధించిన భారతీయులను ప్రశంసిస్తూ సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ 5 కోట్ల తిరంగా సెల్ఫీలు దేశాన్ని మొదటిగా, ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచాలనే విధి నిర్వహణలో ఉన్న భారతీయుల సమిష్టి నిబద్ధతను అద్దం పడుతున్నాయి. ఇది నిజంగా మాతృభూమి కోసం ప్రేమ, ఐక్యతను చాటిన ప్రత్యేక క్షణం. ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!" అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

First published:

Tags: Independence Day, Independence Day 2022, National flag

ఉత్తమ కథలు