Home /News /national /

MORE THAN 800 ACADEMICS HAVE SIGNED IN SUPPORT OF AGRICULTURAL REFORMS BA

Farm Reform Laws: కేంద్రం వ్యవసాయ సంస్కరణలకు 800 మందికి పైగా విద్యావేత్తల మద్దతు

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

800 మందికి పైగా విద్యావేత్తలు వ్యవసాయ సంస్కరణలకు సపోర్టు ఇచ్చారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. 866 మంది విద్యావేత్తలు ఈ ప్రతిపాదనపై సంతకం చేశారు. వ్యవసాయ సంస్కరణల చట్టాలకు మద్దతు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు 35 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తెచ్చిన చట్టాలకు భారీ ఎత్తున మద్దతు లభించింది. 800 మందికి పైగా విద్యావేత్తలు వ్యవసాయ సంస్కరణలకు సపోర్టు ఇచ్చారు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. 866 మంది విద్యావేత్తలు ఈ ప్రతిపాదనపై సంతకం చేశారు. వ్యవసాయ సంస్కరణల చట్టాలకు మద్దతు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భారతదేశంలో మెజారిటీ ప్రజలు తమ జీవనాధారం కోసం వ్యవసాయం మీద ఆధారపడిన వారు ఉన్నారు. అలాంటి వారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులు తీసుకొచ్చారు. దీనిపై విస్త్రతమైన చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉభయ సభల్లోనూ ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ వ్యవసాయ సంస్కరణల చట్టాలు రైతులకు లబ్ధి చేకూర్చుతాయి. రైతుల ఉత్పత్తులకు అత్యధిక ధర లభించడానికి అవకాశం లభిస్తుంది.’ అని ఆ లేఖలో విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.

    కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల రైతులకు కనీస మద్దతు ధరకు ఎలాంటి ప్రమాదం లేదని విద్యావేత్తలు స్పష్టం చేశారు. మండీలకు మాత్రమే పరిమితం కాకుండా, చిన్న, మధ్య తరహా రైతులకు అత్యధిక ధర లభించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘ఈ చట్టాల వల్ల రైతులకు సర్వ స్వతంత్రత లభిస్తుంది. వారు ఉత్పత్తి చేసిన వస్తువులు, ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి అవకాశం లభిస్తుంది. భారత దేశం పౌరులుగా, వివిధ విద్యాసంస్థల్లో పని చేసిన మేం కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణలకు మేం సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలకు కచ్చితమైన భరోసా ఇస్తుందని విశ్వసిస్తున్నాం. అలాగే, వారి పళ్లెంలో ఆహారాన్ని లాక్కోదు. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. అందుకే మేం వ్యవసాయ సంస్కరణల చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు సెల్యూట్ చేస్తున్నాం.’ అని విద్యావేత్తలు స్పష్టం చేశారు.



    చివరగా మరో విషయాన్ని కూడా వారు స్పష్టం చేశారు. రైతులను, దేశాన్ని వేర్వేరుగా చూడలేమని తేల్చి చెప్పారు. అందరం శాంతియుతంగా పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశామన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Farmers Protest, New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు