హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Thunderstorm : అరగంటలో 5000 పిడుగులు.. ఐదుగురు మృతి?

Thunderstorm : అరగంటలో 5000 పిడుగులు.. ఐదుగురు మృతి?

అరగంటలో 5000 పిడుగులు ?

అరగంటలో 5000 పిడుగులు ?

Thunderstorm : ఎక్కడైనా వర్షం వస్తే.. ఒకటో రెండో పిడుగులు పడతాయి. కానీ ఒకే ప్రాంతంలో 5వేల పిడుగులు పడటం చిత్రమే కదా. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వర్షం వస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఒక్క పిడుగు పడినా.. మన గుండె అదురుతుంది. ఆ సౌండ్ భరించలేక చెవులు మూసుకుంటాం. అలాంటిది.. మార్చి 29న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో అరగంటలో 5వేలకు పైగా పిడుగులు పడ్డాయని తెలిసింది. ఇక ఆ జిల్లాలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. చెవులపై నుంచి చేతులు తీసి ఉండరు.

ఇది అత్యంత అరుదైన ఘటన. నమ్మలేని నిజం. భద్రక్ జిల్లాలోని బసుదేవ్‌పూర్ దగ్గర్లో ఇలా జరిగింది. దీనిపై ట్వీట్ చేసిన భువనేశ్వర్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్.. ఈ పిడుగులు ప్రాణాంతకమైనవి అని తెలిపినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐతే.. అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు. ఉమాశంకర్ దాస్‌కి సంబంధించిన ట్వీట్ కూడా లభించట్లేదు. అందువల్ల ఇది నిజంగానే జరిగిందా? ఫేక్ న్యూసా అన్నది తేలాల్సి ఉంది.

నిన్న ఒడిశాలోని సుందర్‌ఘర్, కియోంజర్, బాలాసోర్, కటక్, థెంకనల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. అందువల్ల ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఒడిశాలో ఏప్రిల్ 2 వరకూ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వాన పడుతుందంటూ... ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందువల్ల నిజంగానే అన్ని పిడుగులు పడ్డాయా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

First published:

Tags: Odisha

ఉత్తమ కథలు