ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. సరిహద్దుల్లేని ప్రపంచం అన్న నినాదాన్ని అప్పటి వరకు పాటించిన ప్రపంచ దేశాలు.. కరోనా రాకతో ఒక్కసారిగా సరిహద్దులు గిరిగీసుకున్నాయి. తమ పౌరులను కూడా రానివ్వడానికి ఆంక్షలు విధించాయి. ఎట్టకేలకు సుదీర్ఘ సమయం తర్వాత ఎట్టకేలకు కరోనాకు కొన్ని దేశాలు వ్యాక్సిన్ ను కనిపెట్టాయి. వాటిల్లో భారత శాస్త్రవేత్తలు రూపొందించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లపై ప్రపంచ దేశాలకు బాగానే నమ్మకం కుదిరింది. అందుకే ఇప్పటికే దాదాపు 30 వరకు దేశాలు మన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకున్నాయి. భారత్ కూడా ఆయా దేశాలతో సత్సంబంధాల రీత్యా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తోంది. ఇదే సమయంలో భారత్ లో కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో అవగాహనా లోపం వల్ల భారీ స్థాయిలో వృథా అయిపోతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు భారత్ లో దాదాపు 3కోట్ల 46 లక్షలకు పైగానే కరోనా వ్యాక్సిన్లను అందించారు. అయితే వీటిల్లో దాదాపు 23 లక్షల కరోనా వ్యాక్సిన్లు వృథా అయిపోయాయని తేల్చిచెప్పారు. కరోనా వ్యాక్సిన్ పై ఉన్న అవగాహన లోపం, సమన్వయ లోపం కారణంగానే ఇంత పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు పనికిరాకుండా పోయాయని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి ఒక్కో కొవిషీల్డ్ సీసాలో పది డోసుల కరోనా వ్యాక్సిన్ ఉంటుంది. అదే కొవాగ్జిన్ సీసీ అయితే 20 డోసులకు సరిపడా ఔషధం ఉంటుంది. 0.5 మిల్లీలీటర్ల మేరకు మాత్రమే ఒక్కో డోసుగా ఒక్కో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..
అయితే ఈ సీసాలను ఓపెన్ చేసిన నాలుగు గంటల్లోనే వ్యాక్సిన్లు వేయడం పూర్తి చేయాల్సి ఉంటుంది. నాలుగు గంటల తర్వాత ఆ సీసాల్లో ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఉన్నప్పటికీ వాటిని వాడరు. పాడేయక తప్పదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు వ్యక్తులకు రెండు డోసులను మాత్రమే ఇచ్చి, మిగిలిన డోసులను వృథాగా పారేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కలిపి 23 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ వృథా అయినట్టు వైద్యాధికారులు తేల్చేశారు. కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలనుకుంటున్న వారిని సమన్వయం చేసుకుని వ్యాక్సిన్లను ఇవ్వలేకపోవడం వల్ల, కరోనా వ్యాక్సిన్ పై ఉన్న అపోహల వల్ల కూడా ఈ వృథా జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ పై అవగాహన పెంచితే ఈ తరహా వృథాను అరికట్టవచ్చునని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Possitive, Corona Vaccine, Corona virus, Covaxin, COVID-19 vaccine, Covishield, India, Narendra modi