హోమ్ /వార్తలు /జాతీయం /

Library: దినసరి కూలీ కట్టిన లైబ్రరీ పునర్నిర్మాణం కోసం రూ.20 లక్షల విరాళాలు

Library: దినసరి కూలీ కట్టిన లైబ్రరీ పునర్నిర్మాణం కోసం రూ.20 లక్షల విరాళాలు

Library: దినసరి కూలీ కట్టిన లైబ్రరీ పునర్నిర్మాణం కోసం రూ.20 లక్షల విరాళాలు (ప్రతీకాత్మక చిత్రం)

Library: దినసరి కూలీ కట్టిన లైబ్రరీ పునర్నిర్మాణం కోసం రూ.20 లక్షల విరాళాలు (ప్రతీకాత్మక చిత్రం)

Mysuru Library: ఓ మంచి వార్త చదివిన ఫీలింగ్ కలగాలంటే... ఈ వార్త చదవొచ్చు. ఇది ఎంతో చైతన్యం తెప్పిస్తుంది... సమాజంలో జరిగిన ఓ మంచి విషయాన్ని మన ముందుకు తెస్తోంది.

మీకు గుర్తుండే ఉంటుంది... కర్ణాటక... మైసూరులో... గత శుక్రవారం దుండగులు... ఓ లైబ్రరీని తగలబెట్టేశారు. అది ప్రభుత్వ లైబ్రరీ కాదు... ఓ దినసరి కూలీ ఏర్పాటు చేసిన లైబ్రరీ. ఈ విషయం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అతనికి మద్దతుగా ప్రజలు చేయిచేయి కలిపారు. విరాళాలు సేకరించి మళ్లీ లైబ్రరీ నిర్మిస్తానని అతను ప్రకటించగానే... ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. జస్ట్ 3 రోజుల్లోనే రూ.20 లక్షలు వచ్చాయి. దుండగులు ఎవరన్నదానిపై ఉదయగిరి పోలీసులు కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే... ఇలా విరాళాలు ఇస్తూ... అతన్ని అంతలా ప్రజలు ఎంకరేజ్ చేస్తుండటానికి ఓ బలమైన కారణం ఉంది. అది ప్రేరణ కలిగించే కథ.

దినసరి కూలీ, 62 ఏళ్ల ముస్లిం వ్యక్తి సయీద్ ఇసాక్... పదేళ్లుగా లైబ్రరీని నిర్వహిస్తున్నారు. ఆ లైబ్రరీలో మొత్తం 11,000 పుస్తకాలు ఉండేవి. వాటిలో సుమారు 3,000 వరకు భగవద్గీత పుస్తకాలు కావడం విశేషం. మైసూరులోని రాజీవ్ నగర్, శాంతి నగర్‌లో ఇసాక్ పేరు తెలియని వారు ఉండరు. స్థానికులందరికీ ఆయన ఉచితంగా పుస్తకాలు తీసుకునే అవకాశం కల్పించారు. పెద్దగా చదువుకోని ఇసాక్ కూలి పనులు చేసేవాడు. ఆ తరువాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లీనర్‌గా మారాడు. ఉపాధి కోసం ఎన్నో రకాల పనులు చేశాడు. ప్రస్తుతం లైబ్రరీకి దగ్గర్లోనే నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 4 గంటలకు లైబ్రరీ నుంచి మంటలు వ్యాపిస్తున్నాయని అతనికి సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూసేసరికి పుస్తకాలన్నీ కాలి బూడిద అయిపోయాయి.

ప్రజల్లో పుస్తక పఠనం అలవాట్లను పెంపొందించడానికీ, కన్నడ భాషాభివృద్ధి కోసం రాజీవ్ నగర్‌లోని అమ్మర్ మసీదు దగ్గర్లోనే ఈ పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. అక్కడికి ప్రతిరోజూ 100-150 మంది వచ్చేవారు. ఇసాక్ ప్రతిరోజూ 17 వార్తా పత్రికలు కొని పాఠకులకు అందుబాటులో ఉంచేవాడు. వాటిలో కన్నడ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ న్యూస్ పేపర్లు ఉండేవి. గ్రంథాలయంలో 85 శాతం కన్నడ పుస్తకాలే ఉండేయి. ఇంగ్లీష్, ఉర్దూ బుక్స్ కూడా లభించేయి. ఈ పుస్తకాల కోసం ఇసాక్ ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేయనప్పటికీ, లైబ్రరీ నిర్వహణ, వార్తాపత్రికల కొనుగోలు కోసం ప్రతినెలా దాదాపు రూ.6,000 ఖర్చు చేసేవాడు.

ఇది కూడా చదవండి: Fingers: మీ చేతి వేళ్లు ఎలా ఉంటాయి?... వేళ్లను బట్టీ మీరు ఎలాంటి వారో తెలుసుకోండి

ఇప్పుడు తనకు వచ్చిన విరాళాలతో... ఇసాక్ మళ్లీ లైబ్రరీని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. తాను చిన్నప్పుడు చదువుకునే అవకాశం లభించలేదన్న ఇసాక్... ఇప్పుడు తన ద్వారా ఇతరులకు ఆ అవకాశం కల్పించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. లైబ్రరీ నిర్మాణానికి రూ.25 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఆల్రెడీ రూ.20 లక్షలు వచ్చాయి కాబట్టి... మరో రూ.5 లక్షలు రావడం కష్టమేమీ కాదు. అందువల్ల ఇసాక్ లైబ్రరీ పునర్నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

First published:

Tags: Karnataka, National News, VIRAL NEWS

ఉత్తమ కథలు