• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MORE THAN 170 MLAS AND OTHER LEADER LEFT CONGRESS PARTY DURING 2016 TO 2020 REVEALS NEW SURVEY AK

Indian National Congress: కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉందో చెప్పిన సర్వే.. లెక్కలతో సహా..

Indian National Congress: కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉందో చెప్పిన సర్వే.. లెక్కలతో సహా..

సోనియా, రాహుల్(ఫైల్ ఫొటో) (Image-PTI)

Indian National Congress: పార్టీలు మారిన వారి లెక్కలు తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారితో పోల్చితే.. ఆ పార్టీలో చేరిన వారి సంఖ్య చాలా తక్కువ అనే విషయం స్పష్టమవుతోంది.

  • Share this:
    2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. అప్పటి నుంచి మళ్లీ పుంజుకున్న దాఖలాలు కనిపించలేదు. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోగలిగినా.. 2019లో మాత్రం మళ్లీ దారుణ పరాభవాన్ని చవిచూసింది కాంగ్రెస్. ప్రస్తుతం ఆ పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మరికొన్ని నెలల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కు 2016 నుంచి 2020 మధ్య కాలంలో భారీ దెబ్బే తగిలినట్లు ఓ సర్వే పేర్కొంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 170 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారని వెల్లడించింది. వీరంతా బీజేపీ సహా ఇతర పార్టీల్లో చేరిపోయారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్‌ వెల్లడించింది.

    ఈ విషయంలో బీజేపీ పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. ఇదే సమయంలో బీజేపీకి చెందిన వాళ్లు కేవలం 18 మంది మాత్రమే ఆ పార్టీని వీడారని సర్వే వెల్లడించింది. అయితే వీరంతా ఎన్నికల సమయంలోనూ పార్టీని వీడారని.. పార్టీలు మారిన వారిలో 405 మంది తిరిగి పోటీ చేశారని పేర్కొంది. వారిలో 182 మంది బీజేపీలో చేరారని వివరించారు. ఇక ఇలా పార్టీలు మారిన వారిలో కాంగ్రెస్ గూటికి చేరిన వారి సంఖ్య 38 మందిగా ఉంది. ఇలా కాంగ్రెస్‌ను వీడిన వారిలో పాతిక మంది నేతలు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌లో చేరారు.

    2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు పార్టీని వీడారని, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారని ఈ సర్వే వెల్లడించింది. అంతేకాదు పార్టీలు మారిన వారిలో 16 మంది తిరిగి రాజ్యసభకు పోటీ చేశారు. అందులో 10 మంది బీజేపీలో చేరిపోయారు. ఇలా పార్టీలు మారిన వారి లెక్కలు తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారితో పోల్చితే.. ఆ పార్టీలో చేరిన వారి సంఖ్య చాలా తక్కువ అనే విషయం స్పష్టమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు