Home /News /national /

MORE THAN 10 KILLED DUE TO CLOUDBURST NEAR AMARNATH HOLY CAVE HERE IS THE HELPLINE NUMBERS AK

Amarnath Incident: అమర్‌నాథ్‌లో ఘోర ప్రమాదం.. సాయం కోసం సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..

అమర్‌నాథ్‌లో ప్రమాదానికి కారణమైన ఆకస్మిక వరద

అమర్‌నాథ్‌లో ప్రమాదానికి కారణమైన ఆకస్మిక వరద

మరోవైపు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, దీనిపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌తో మాట్లాడినట్లు తెలిపారు.

    అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షం, ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది వరదల్లో గల్లంతయ్యారు. ఈ సంఘటన తర్వాత పరిపాలన హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. 01942496240, 01942313149 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ప్రయాణానికి వెళ్లిన వారికి గురించి తెలుసుకోవచ్చు. వీటితో పాటు 18001807198 (జమ్ము), 18001807199 (శ్రీనగర్)కు వెళ్లిన యాత్రికుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా జారీ చేయబడ్డాయి. మరోవైపు ఢిల్లీ ఆధారిత NDRF నంబర్ 011-23438252 011-23438253, కాశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్ 0194-2496240, పుణ్యక్షేత్రం బోర్డు హెల్ప్‌లైన్ నంబర్ 0194-2313149.

    ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు అమర్‌నాథ్ గుహ సమీపంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం, ఆకస్మిక వరదల కారణంగా గుడి సమయంలో నిర్మించిన గుడారాలు, టెంట్లలోకి నీరు ప్రవేశించింది. బలమైన నీటి ప్రవాహంలో అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. దీంతో పాటు పలువురు నీటిలో చిక్కుకున్నారు. ఈ సంఘటన తర్వాత అమర్‌నాథ్ యాత్ర వాయిదా వేయబడింది. NDRF, SDRF బృందాలను సహాయక చర్యల కోసం మోహరించారు.



    మరోవైపు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, దీనిపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో బాధిత పౌరులందరికీ అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక ఈ రోజు సాయంత్రం సాయంత్రం 5.30 గంటల సమయంలో అమర్‌నాథ్ గుహ దిగువ ప్రాంతంలో మేఘాలు విస్ఫోటనం చెందినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ చీఫ్ తెలిపారు.

    Petrol: దేశంలో 5 ఏళ్ల తరువాత పెట్రోల్ నిషేధం.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

    Shocking: బ్లేడ్ తో కోసుకుని.. పీవీఆర్ సినిమా హల్ లో వ్యక్తి సూసైడ్..

    ప్రమాదం జరిగిన వెంటనే తమ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయని అన్నారు. ప్రాథమికంగా రిలీఫ్ అండ్ రెస్క్యూ వర్క్ ఏజెన్సీలు దీనిని మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణిస్తున్నాయి. ITBPకి చెందిన రెండు కంపెనీలతో పాటు, NDRF రెండు బృందాలు కూడా సహాయ మరియు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. అయితే గుడారం దగ్గర రక్షకుల బృందాలు ఉన్నాయి కాబట్టి.. ఎక్కువ మంది ప్రయాణికులను రక్షించగలిగారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amarnath Yatra 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు