సాధారణంగా నివాస ప్రాంతాల మధ్యకు కోతుల (Monkeys) గుంపు వస్తే ఏం చేస్తారు? మొక్కలు పాడు చేస్తాయని, వస్తువులను నాశనం చేస్తాయని తరిమేస్తారు. మహా అయితే ఎవరైనా ఒకటి, రెండు సందర్భాల్లో కోతులకు పండ్లు అందించడం చూసుంటారు. కానీ కోతుల పేరిట ఆస్తులు రాయడం చూశారా? నమ్మడానికి వింతగా అనిపిస్తున్నా.. మీరు చదివింది వాస్తవం. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి(32 Acre Of Land) ఉంది. భూముల కోసం మన పర భేదం లేకుండా వివాదాలు, హత్యలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇదేంటని అనుకుంటున్నారా? కానీ ఆ ఊరిలోని కోతుల పేరిట భూమి ఉన్నట్లు పంచాయతీ రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి.
ఆ గ్రామంలో కోతులకు నిత్యం అతిథి మర్యాదలు కూడా చేస్తున్నారు. ఇంటికి వచ్చిన కోతులకు ఆహారం పెట్టకుండా పంపరు. ఆసక్తిగా అనిపిస్తోందా.. అయితే ఆ గ్రామం ఎక్కడుంది, అక్కడి ఆచారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* కోతులకు ఆహారం లేదనరు
మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామం (Upla Village) లో సిమియన్ వర్గానికి (Simian Residents) చెందిన వారు నివసిస్తున్నారు. వీళ్లు పూర్వీకుల నుంచి కోతులను గౌరవిస్తారు. ఇప్పటికీ ఇంటి వద్దకు కోతులు వచ్చినప్పుడు ఎవ్వరూ ఆహారం ఇవ్వకుండా తిరస్కరించరు. అందరూ కచ్చితంగా కోతులకు ఏదో ఒక ఆహారం అందిస్తారు. అంతే కాకుండా గ్రామంలో వివాహాలు, ఇతర వేడుకల సందర్భాల్లో కోతులను ప్రత్యేకంగా గౌరవించి, బహుమతులు కూడా అందిస్తారు.
* రికార్డుల్లో కోతుల పేరిట భూమి
ఉప్లా గ్రామ పంచాయతీలో గుర్తించిన భూ రికార్డుల్లో 32 ఎకరాల భూమి గ్రామంలో నివాసం ఉంటున్న అన్ని కోతుల పేరిట రాసి ఉంది. 32 ఎకరాల భూమి కోతులకు చెందినదని పత్రాల్లో స్పష్టంగా ఉందని గ్రామ సర్పంచ్(తల) బప్పా పడ్వాల్ చెప్పారు. అయితే జంతువుల కోసం ఈ నిబంధనను ఎవరు తీసుకొచ్చారో భూమిని ఎప్పుడు రాశారో తెలియదని ఆయన చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : స్కూల్ బస్లో నక్కిన పైథాన్ .. ఎంత పెద్ద పామును పట్టుకున్నారో ఈ వీడియో చూడండి
గతంలో గ్రామంలో నిర్వహించే అన్ని ఆచారాలలో కోతులు భాగంగా ఉండేవని తెలిపారు. ఇప్పుడు గ్రామంలో దాదాపు 100 వరకు కోతులు ఉంటాయని పేర్కొన్నారు. జంతువులు సాధారణంగా ఒకే చోట ఎక్కువ కాలం ఉండవు కాబట్టి, కాలక్రమేణా గ్రామంలో ఉండే కోతుల సంఖ్య తగ్గిపోయిందని బప్పా పడ్వాల్ వివరించారు. ఆ 32 ఎకరాల భూమిలో అటవీశాఖ మొక్కలు నాటే పనులు చేపట్టిందని, అక్కడ పాడుబడిన ఇల్లు కూడా ఉందని, అది ఇప్పుడు కూలిపోయిందని తెలిపారు. కోతుల పేరిట రాసిన ఈ భూమిని ఇప్పటి వరకు ఎవరూ కబ్జా చేయకపోవడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Monkeys, Trending news, VIRAL NEWS