దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర ( maharshtra ) కోతుల సంఘటనలో అటవి అధికారులు స్పందించారు. గ్రామంలో హంగామా చేస్తున్న రెండు కోతులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు వాటిని నాగ్పూర్ ( Nagpur) సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు.
కాగా మనుషులే కాదు జంతువులు పగ తీర్చుకుంటాయని అనిపించేలా ఓ ఘటన మహారాష్ట్రలోని ( maharshtra )బీడ్ జిల్లాలో మజల్గావ్లో కోతులు (Monkeys) కుక్కలను చంపుతున్నాయి. గత నెల రోజులుగా ఈ ఘటన జరుగుతుందని గ్రామస్తులు చెప్పారు.. ఇప్పటిదాకా సుమారు 300 కుక్కల (Dogs)ను కోతులు చంపినట్టు గ్రామస్థులు చెప్పారు.. ఇందుకు కారణం ఏంటంటే.. గ్రామంలో ఉన్న కుక్కలు గత పదిహేను రోజుల క్రితం ఓ కోతిని చంపాయని ,దీంతో గ్రామంలో ఉన్న కుక్కలపై పగను పెంచుకున్న రెండు కోతులు కుక్కపిల్లలను ఎత్తుకుని వెళ్లి ఎత్తైన చెట్లు పైకి లేదా బిల్డింగ్లపైకి తీసుకువెళ్లి అక్కడి నుండి కిందకి విసిరేస్తున్నాయి. ఇలా కుక్కపిల్లలు చనిపోతున్నాయి.. ఒకవేళ అవి చనిపోకపోతే.. తిరిగి మళ్లి తీసుకుని వెళ్లి మరోసారి విసిరేశాయి..
ఇలా గ్రామానికి చెందిన సీతారాం నైబాల్కు చెందిన కుక్కపిల్లను ( Dogs ) కూడా పదిహేను రోజుల క్రితం కోతి తీసుకెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. కుక్కపిల్ల అరవడంతో.. నైబాల్ వెళ్లి ఆ కుక్క పిల్లను రక్షించగలిగాడు. కుక్కను రక్షించే ప్రయత్నంలో నైబాల్ కాలు విరిగి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని సమాచారం.
కాగా ఇలా కోతులు వీరవిహంగం చేస్తుండడంతో గ్రామస్తులు అటవీ శాఖాధికారులను ( forest officers ) సంప్రదించి కోతులను పట్టుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఒకరోజు వచ్చినా ఒక్క కోతిని కూడా పట్టుకోలేకపోయారని దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు.. కాగా ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో.. అటవీ అధికారులు బీభత్సం సృష్టించిన రెండు కోతులకు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిశారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.