హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

MonkeyPox : మన దేశానికీ మంకీపాక్స్ ముప్పు -ముంబైలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు..

MonkeyPox : మన దేశానికీ మంకీపాక్స్ ముప్పు -ముంబైలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు వారాల వ్యవధిలోనే 14 దేశాలకు పాకిన మంకీపాక్స్ ఇప్పుడు ఇండియాను సైతం కలవరపెడుతున్నది. ఆర్థిక రాజధాని ముంబైలో మంకీపాక్స్ రోగుల కోసం ముందస్తుగానే ఐసోలేషన్ వార్డు ఏర్పాటైంది. మిగతా రాష్ట్రాలూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి..

కరోనా నుంచి కోలుకుంటోన్న ప్రపంచానికి కొత్త పీడలా దాపురించిన మంకీపాక్స్ వైరస్ (Monkeypox Virus) వేగంగా విస్తరిస్తున్నది రెండు వారాల వ్యవధిలోనే 14 దేశాలకు పాకిన మంకీపాక్స్ ఇప్పుడు ఇండియాను సైతం కలవరపెడుతున్నది. ప్రస్తుతానికి కేసులేవీ వెలుగులోకి రానప్పటికీ, అనుకోని పరిస్థితి తలెత్తితే ఎదుర్కోడానికి అన్ని రాష్ట్రాలూ సమాయత్తం అవుతున్నాయి. ఈ పనిలో మహారాష్ట్ర ఒక అడుగు ముందుంది..

ఈ క్రమంలోనే బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నగరంలోని కస్తుర్బా ఆసుపత్రిలో 28 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసింది. మంకీపాక్స్‌ సస్పెక్ట్‌ రోగులను ఈ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు బీఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

MonkeyPox : మహమ్మారిలా మంకీపాక్స్ -గాలి ద్వారా వ్యాప్తి? -క్వారంటైన్ విధిస్తూ బెల్జియం సంచలనం


అయితే, ఇప్పటి వరకు మంకీపాక్స్‌ సోకినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని సదరు అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రజలకు సలహాలు, సూచనలు జారీ చేసింది. మంకీపాక్స్‌ సాధారణంగా కోతుల్లో కనిపిస్తుందని, పశ్చిమ, మధ్య ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇప్పటికే వైరస్‌ కేసులు నమోదైన దేశాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షిస్తుండగా.. అనుమానిత రోగులను ఐసోలేట్‌ చేసేందుకు కస్తూర్బా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

MonkeyPox Virus: మాయదారి మంకీపాక్స్.. వేగంగా విస్తరిస్తోన్న వైరస్.. లక్షణాలు, వ్యాప్తి ఇలా..


అనుమానిత రోగుల నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NIV)కి పంపనున్నట్లు పేర్కొంది. అలాగే ముంబైలోని ఆసుపత్రులతో పాటు ఆరోగ్య సంస్థలకు మంకీపాక్స్‌కు సంబంధించి అనుమానిత రోగులు వస్తే వెంటనే కస్తూర్బా ఆసుపత్రికి సమాచారం అందించాలని ఆదేశించింది. మంకీపాక్స్‌ సోకిన వారికి సాధారణంగా జ్వరం, దద్దుర్లు, శోషరస గ్రంథుల వాపు తదితర సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది.

PM Kisan | PM SYM : రైతులకు మరో శుభవార్త.. ప్రతినెలా రూ.3000 పెన్షన్.. పీఎం కిసాన్ ద్వారా ఇలా..

ఏమిటీ మంకీపాక్స్‌?: స్మాల్‌ పాక్స్‌ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్‌ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్‌ కనిపించింది.

లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది.

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ తేదీ ఇదే


ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్‌ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది. శృంగారం ద్వారానూ ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు రిపోర్టులున్నాయి.

చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ వాడతారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. మందులేని వైరస్ కావడంతో మంకీపాక్స్ పై ఆందోళనలు పెరుగుతున్నాయి.

First published:

Tags: Covid, India, Monkeypox, Mumbai, Virus

ఉత్తమ కథలు