Home /News /national /

MONKEYPOX DECLARED PANDEMIC BY WORLD HEALTH NETWORK PVN

Monkeypox : చచ్చాం రా బాబు..కరోనాలానే మంకీపాక్స్ కూడా మహమ్మారేనంట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Monkeypox Declared pandamic  : ఇప్పటికే రెండున్నరేళ్లుగా కరోనావైరస్ తో అల్లాడుతున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది రల్డ్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ (డబ్ల్యూహెచ్‌ఎన్‌). కరోనా మహమ్మారి (Coronavirus) ఇంకా మనల్ని వదలివెళ్లలేదు. 2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది. ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
Monkeypox Declared pandamic  : ఇప్పటికే రెండున్నరేళ్లుగా కరోనావైరస్ తో అల్లాడుతున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది రల్డ్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ (డబ్ల్యూహెచ్‌ఎన్‌). కరోనా మహమ్మారి (Coronavirus) ఇంకా మనల్ని వదలివెళ్లలేదు. 2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది. ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా కొత్త వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మంకీపాక్స్ (Monkeypox Virus).ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ వేగంగా విస్తరిస్తోంది. మంకీపాక్స్ పై హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించాలా వద్దా అన్న అంశంపై చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆ సమావేశం కంటే ముందే ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్(WHN)కీలక ప్రకటన చేసింది. కరోనా తర్వాత ప్రపంచదేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ను గురువారం వరల్డ్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ మహమ్మారిగా(Pandamic)గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ వేగంగా విస్తరిస్తున్నదని, అన్ని దేశాలూ కలిసికట్టుగా చర్యలు తీసుకోకపోతే దీన్ని అడ్డుకోవడం కష్టమని హెచ్చరించింది. మంకీపాక్స్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్.

మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ నివారణ చర్యలు తీసుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, అనేక మంది దివ్యాంగులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 58 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 3 వేల 417 మందికి మంకీపాక్స్ సోకిందని వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్య నివేదికలు చెబుతున్నాయి. అయితే కరోనా వైరస్ తో పోల్చితే మంకీపాక్స్ అంత తేలికగా వ్యాపించదు. అయితే పలు దేశాలకు విస్తరించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ గుర్తించింది.ఇది చాలా ప్రమాదకరమని తెలిపింది. పెద్దల కంటే చిన్నారుల్లో మంకీపాక్స్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువులతో సహా వన్యప్రాణులకు సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపింది.

Best dress : స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ పొందడానికి ఇలాంటి కలర్ డ్రెస్‌ని ఎంచుకోండి!

Shocking : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపి మహాపతివ్రతలా డ్రామా!

అసలేంటీ వైరస్‌?

మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. అంటే మనదేశంలో తట్టు, అమ్మవారిలానే ఇది కూడా కనిపిస్తుంది. ఈ వైరస్‌ను మొదట 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. అందువల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మనుషులకు సోకింది. 1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అందులోనూ ఎక్కువగా ఎలుకలు, చంచులు, ఉడతల నుంచి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. గాలి తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వ్యాధి ఎవరికైనా సోకిన తర్వాత.. శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు 6 నుంచి 13 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 21 రోజులు సమయం తీసుకుంటుంది.Husband : భార్య జుట్టు కత్తిరించి గుండు చేసిన భర్త..ఎందుకో తెలిస్తే వాడిని కోసి కారంపెడతారు!

లక్షణాలు (Monkeypox Symptoms)

మంకీపాక్స్ సోకిన వారిలో స్మాల్‌పాక్స్ మాదిరిగానే..ముఖం, కాళ్లుచేతులపై బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వ్యాపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట ఉంటుంది. కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. ఈ వ్యాధి బారినపడిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. తక్కువ మందికి మాత్రమే ప్రాణాపాయంగా ఉంటుంది. ప్రతి 10 మందిలో ఒకరికి మంకీపాక్స్ ప్రాణాంతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Monkeypox

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు