కేద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించారు ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ. నరేంద్ర మోదీ చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, న్యూస్ 18తో ప్రత్యేకంగా ముచ్చటించారు ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ(Modi brother Prahlad Modi) . నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన చాలా సంవత్సరాలు రేషన్ షాప్ నడిపారు. ప్రధానమంత్రి చిన్ననాటి జ్ఞాపకాలను, ప్రభుత్వ పనితీరుపై తన అంచనాలను ఆయన న్యూస్18తో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ఫీలింగ్ ఎలా ఉంది?
ఒక కుటుంబంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. 1970ల్లో మోదీ అన్నీ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు జాతి పుత్రుడు అయ్యారు. మోదీ ఇప్పుడు ప్రతి భారతీయుడికి సంరక్షకుడు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకున్నారు. భారతదేశం గర్వపడేలా చేస్తున్నారు. మన దేశ ప్రధానిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాంటివారు చాలా విషయాల్లో అభినందించడం ఇదే తొలిసారి. మోదీజీ మనతో పాటు మొత్తం దేశం గర్వించేలా చేశారు.
మోదీ ప్రభుత్వం చేసిన అతి ముఖ్యమైన పని ఏంటి?
ప్రధానిగా ప్రతి భారతీయుడికీ మోదీ అండగా నిలిచారు. ఆయనకు కావాల్సింది ‘సబ్ కా వికాస్’.. దాని కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన వల్లే ఈరోజు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారు.
ప్రధాని గురించి మీకు ఏవైనా చిన్నప్పటి విషయాలు గుర్తున్నాయా?
మోదీ చిన్నతనం నుంచి హార్డ్ వర్కింగ్ పర్సన్. చదువులో ముందుండేవారు. ఆయన ఎప్పుడూ ఎవరినీ డిస్టర్బ్ చేయలేదు. అన్ని విషయాలపై బాగా దృష్టి కేంద్రీకరించేవారు. అందరికంటే భిన్నంగా ఉండేవారు. మేము ఆయన్ను చూస్తూ పెరిగాం. ఆయన ఏం చేసినా, దాన్ని అనుసరించేవాళ్లం.
మోదీ ప్రభుత్వానికి మీరు ఎంత స్కోరు ఇస్తారు?
నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యుత్తమ పనితీరు కనబరిచిందని నేను భావిస్తున్నారు. అందుకే 10కి.. 10కి పైగా మార్కులు ఇస్తాను. కరోనా పరిస్థితుల నుంచి దేశాన్ని సమర్థంగా కాపాడారు. భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా కొత్త ఎత్తుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఇండియా అత్యంత ముఖ్యమైన దేశం.
మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మీరు ఆయనకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను మోదీజీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. మోదీ భారతదేశ పుత్రుడు, దేశానికి సంరక్షకుడు కూడా. ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మరో 15 ఏళ్లు మోదీజీ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను. భారతదేశం ఆయన కుటుంబం, భారత్‌కు కూడా మోదీ కావాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.