Home /News /national /

MODI WILL LAUNCH NEW HEALTH SCHEMES ON AUGUST 15 IF YOU READ THESE IT WILL BE AMAZING UMG GH

Health Schemes: ఆగస్టు 15న మోదీ స్పెషల్ స్కీమ్ లాంచ్.. ఇక వారికి ఏ ఢోకా లేనట్టే.. మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి..!

ఆగస్టు 15న  కొత్త ఆరోగ్య పథకాలు  లాంఛ్ చేయనున్న మోదీ .. వీటిని చదివితే అత్యద్భుతం అంటారు !

ఆగస్టు 15న కొత్త ఆరోగ్య పథకాలు లాంఛ్ చేయనున్న మోదీ .. వీటిని చదివితే అత్యద్భుతం అంటారు !

సమానమైన, చౌకైన, నాణ్యమైన హెల్త్‌(Health) కేర్‌ సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi) ఆగస్టు 15న అంబ్రెల్లా హెల్త్‌కేర్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఇది ఇప్పటికే ఉన్న పథకాల స్థానంలో మెరుగైన ప్రయోజనాలను అందించనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
సమానమైన, చౌకైన, నాణ్యమైన హెల్త్‌(Health Care) కేర్‌ సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న అంబ్రెల్లా హెల్త్‌కేర్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఇది ఇప్పటికే ఉన్న పథకాల స్థానంలో మెరుగైన ప్రయోజనాలను అందించనుంది. కొత్త పథకాన్ని పీఎం సమగ్ర స్వాస్త్య యోజన(PM Samagra Swasthya Yojana)గా పేర్కొంటున్నారు. దీంతోపాటు మరో రెండు పథకాలను కూడా మోదీ ప్రారంభించనున్నారు. వైద్య ప్రక్రియలను నిర్వహించడానికి వైద్యులను విదేశాలకు పంపడానికి హీల్‌ బై ఇండియా, దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి హీల్ ఇన్ ఇండియా అనే పథకాలను తీసుకొస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు.

మూడు పథకాల ప్రత్యేకతలు..
సమగ్ర స్వాస్థ్య యోజన పథకంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(PM-JAY), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ABDM), పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PM-ABHIM) వంటి పథకాలు కలుస్తాయి. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) రీబ్రాండింగ్ లేదా దాని అధునాతన వెర్షన్‌గా సమగ్ర స్వాస్థ్య యోజన పథకం ఉంటుందని ఓ అధికారి వివరించారు. ఈ పథకాల గురించి ఓ అధికారి మాట్లాడుతూ..‘ఈ కొత్త పథకం సంతృప్త విధానాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది అన్ని ఆరోగ్య సంరక్షణ సేవలను కవర్ చేస్తుంది, తద్వారా ప్రతి వ్యక్తి వాటిని సులభంగా పొందవచ్చు. ఇది సంపూర్ణమైన, సమగ్రమైన విధానంతో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అవుతుంది. ఈ అంబ్రెల్లా స్కీమ్‌ కింద PM-JAY, ABDM, PM-ABHIM వంటి ప్రభుత్వ అన్ని ప్రధాన ఫ్లాగ్‌షిప్ పథకాలు చేరుతాయి.’ అని తెలిపారు.
ఈ మూడు కార్యక్రమాల గురించి ఇటీవలే ప్రధానమంత్రి ముందు ఒక వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఓ అధికారి చెప్పారు.

మెడికల్‌ టూరిజానికి ప్రోత్సాహం
హీల్ ఇన్ ఇండియా అనేది మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి దేశంలోని మొట్టమొదటి ఇన్‌స్టిట్యూషనల్‌ మెకానిజం. చికిత్స కోసం భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ రోగులను మంచి వేదిక రూపొందించాలనే ఆలోచన ఉంది. ఇది విదేశీ రోగులకు ఇండియాలోని ఆస్పత్రులను ప్యాకేజీ రేటు, సౌకర్యాలు, సేవల రకాల ఆధారంగా సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు కేరళ అటువంటి పోర్టల్‌ను నిర్వహిస్తోంది. అయితే వైద్య విలువ ప్రయాణంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్లాట్‌ఫారమ్ సమగ్రమైంది. రోగులు తమ ఫిర్యాదులను నివేదించవచ్చు, ఆసుపత్రికి ఫీడ్‌బ్యాక్ రేటింగ్‌లను కూడా ఇవ్వవచ్చు. రోగులు కూడా భారతదేశానికి వచ్చే ముందు ఆసుపత్రిని సంప్రదించి టెలిమెడిసిన్ తీసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ విదేశీ రోగులకు, వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖరీదైన ఆసుపత్రులకు హై-ఎండ్ ఆసుపత్రుల జాబితాను అందిస్తుంది.

హీల్ బై ఇండియా చొరవ వైద్యులు, ఇతర వైద్య నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి శస్త్ర చికిత్సలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రపంచ సమాజానికి మార్గాన్ని అందిస్తుంది. నేషనల్ హెల్త్ అథారిటీ హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ(HPR), హాస్పిటల్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR) ఈ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడంలో సపోర్ట్‌ చేస్తున్నాయి.

ఇదీ చదవండి:  Ramayana Quiz: రామాయణం పోటీల్లో విజేతలుగా ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు !కొత్త హెల్త్ స్కీమ్స్ గురించి మెదాంత హాస్పిటల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచ స్థాయి చికిత్స, సౌకర్యాల కారణంగా విదేశాలలో ఉన్న రోగులకు సేవ చేయడానికి భారతదేశానికి భారీ సామర్థ్యం ఉంది. వారు యూఎస్‌ ధరలో పదో వంతు పొందుతారు. నాణ్యత కూడా అదే. కానీ భారత్‌కు వచ్చినప్పుడు వారికి అవగాహన తక్కువ. కాబట్టి, భారతదేశంలోని ఆసుపత్రుల గురించి వారు తెలుసుకోవాలి. కాబట్టి మేము వారికి సౌకర్యాలు కల్పించాలి. వైద్య వీసా అందుబాటులో ఉండాలి. విమానాశ్రయంలో వైద్య ఛానల్ అందుబాటులో ఉండాలి. ఆసుపత్రులు వారిని చికిత్స కోసం విమానాశ్రయం నుంచి తీసుకువెళ్లాలి. వారిని తిరిగి విమానంలో చేర్చాలి. కాబట్టి, సానుకూల అనుభవంతో మొత్తం సర్కిల్‌ను ఏకం చేస్తే భారతదేశ సామర్థ్యం అపరిమితంగా ఉంటుంది.’ అని వివరించారు.పదో స్థానంలో భారత్‌
మెడికల్ టూరిజం ఇండెక్స్ 2020-21లో టాప్ 46 దేశాలలో భారతదేశం ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది. భారతదేశంలో చికిత్స ఖర్చులు USలో ఖర్చు కంటే 65-90% తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో 39 జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్, 657 నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి ప్రపంచ నాణ్యతా ప్రమాణాలకు సమానంగా లేదా మెరుగైనవిగా పరిగణిస్తారు.
Published by:Mahesh
First published:

Tags: Ayushman Bharat Health Scheme, Health scheme, Independence Day, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు