కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ వేవ్ ఒక్కటే సరిపోదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప (Yediyurappa) అన్నారు. ఇటీవల బెంగుళూర్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోదీ వేవ్ (Modi Wave) లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి సాయపడుతుందని రాష్ట్రంలో మాత్రం పార్టీ తప్పనిసరిగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీ కేంద్రంలో చాలా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అవుతారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) మేల్కొంది. ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మనం మరింత కష్టపడాలని ఆయన కార్యకర్తలతో అన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాష్ట్రంలో త్వరలో జరిగే హనేగల్, సిందగి ఉప ఎన్నికల్లో (Elections) గెలవడం అంత సులభం కాదని ఆయన అన్నారు. ఇది పార్టీకి అగ్నిపరీక్షలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసినప్పుడే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పగలమన్నారు. "మేము మోదీ పేరు మీద లోక్ సభ (Loksabha) ఎన్నికలను గెలవగలము కానీ అసెంబ్లీ పనులను మా పనుల ఆధారంగా మాత్రమే గెలవగలము" అని యడ్యూరప్ప అన్నారు.
CTET Dec 2021 : టీచర్ కావాలనుకుంటున్నారా.. సీటెట్ 2021 దరఖాస్తు చేసుకోండి
పార్టీ సమావేశంలో, యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, డివి సదానంద గౌడ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ పాల్గొన్నారు. వీరి నాయకత్వంలో నాలుగు బృందాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ అవకాశాలను అంచనా వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పార్టీలో ఎక్కడైన లోపాలు ఉంటే సరి చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలపర్చాలనే ప్రయత్నంలో ఉన్నారు.
గతంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ఏడాది జూలైలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవివికి రాజీనామా చేశారు. ఇందు కారణాల్లో ఆయన వయసు 75 ఏళ్లు పైబడండం ఒకటి. కర్ణాటకలో యడియూరప్ప తరువాత బలమైన రాష్ట్రస్థాయి నాయకుడు బీజేపీ లేడు. ఆయన ఉండగానే మరో మెరుగైన నాయకత్వాన్ని తయారు చేయడానికి బీజేపీ (BJP) యడ్యూరప్పను తప్పించింది. అంతే కాకుండా యడ్యూరప్పపై పలు అవినీతి ఆరపణలు కూడా ఉన్నాయి. శక్తివంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు ఆ వర్గం నుంచి మద్దతు ఉన్నప్పటికీ... ఆయనకు ప్రజాబలం తగ్గిందని బీజేఈ హైకమాండ్ భావించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Karnataka bjp, Karnataka Politics, Narendra modi