బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)లో ఇండియన్ అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. అంచనాలకు మించి భారత క్రీడాకారులు పతకాలతో అదరగొడుతున్నారు. ఉమెన్ క్రికెట్(Cricket)లో ఇండియన్ టీమ్ తాజాగా రజతం గెలిచింది. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడలలో భారతదేశం తరఫున పతకాలు గెలిచిన విజేతలను మోదీ సోమవారం అభినందించారు. రజతం గెలిచి సత్తా చాటిన మహిళా క్రికెట్ జట్టును ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రికెట్‌లో మొట్టమొదటి CWG పతకం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదని తెలిపారు.
టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం గెలిచినందుకు శరత్ కమల్, శ్రీజ ఆకులను అభినందించిన మోదీ(Modi), వారి పట్టుదల, దృఢత్వాన్ని కొనియాడారు. అద్భుతమైన టీమ్‌వర్క్ చూపించారని చెప్పారు. ‘కలిసి ఆడటం, గెలవడం వల్ల వచ్చే ఆనందం వేరు’ అని మోదీ పేర్కొన్నారు. బరిలోకి దిగిన అన్ని CWG ఈవెంట్‌లలో శరత్ ఫైనల్స్‌కు చేరుకోవడం అత్యద్భుతమని మోదీ తెలిపారు.
బ్యాడ్మింటన్(Badminton)లో కాంస్య పతకం గెలుచుకున్నందుకు కిదాంబి శ్రీకాంత్‌ను మోదీ అభినందిస్తూ.. భారత బ్యాడ్మింటన్ ప్రముఖులలో శ్రీకాంత్ ఒకడని చెప్పారు. ‘ఇది శ్రీకాంత్‌కు నాలుగో CWG పతకం. ఈ మెడల్ అతడి నైపుణ్యం. నిలకడను చూపుతుంది. అతడు వర్ధమాన అథ్లెట్లకు స్ఫూర్తినిస్తూ, భారతదేశాన్ని మరింత గర్వించేలా చేయాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాన మంత్రి జోడించారు.
మహిళా క్రికెట్ జట్టును ప్రశంసిస్తూ మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘క్రికెట్, భారతదేశం విడదీయరానివి. మన మహిళా క్రికెట్ జట్టు CWGలో అద్భుతమైన క్రికెట్ ఆడింది. ప్రతిష్టాత్మకమైన రజత పతకాన్ని ప్లేయర్స్ ఇంటికి తీసుకువచ్చారు. క్రికెట్‌లో మొట్టమొదటి CWG పతకం కావడం, దాన్ని భారత్ గెల్చుకోవడం అనేది ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది’ అని చెప్పారు.
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో కాంస్యం గెలిచిన ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌లను ప్రశంసించిన మోదీ, వారిని చూసి గర్విస్తున్నాన్నట్లు తెలిపారు. ‘CWGకి బయలుదేరే ముందు గాయత్రితో తన స్నేహం ట్రీసా గురించి నాకు చెప్పింది, కానీ పతకం గెలిస్తే ఎలా సంబరాలు చేసుకుంటామనేది చెప్పలేదు. ఇప్పుడు ఇందుకు ప్లాన్ చేసుకుంటుందని నేను ఆశిస్తున్నాను’ అని గేమ్స్‌కు ముందు ఇంటరాక్షన్‌లో మోదీ తెలిపారు.
బాక్సింగ్‌లో రజతం సాధించినందుకు సాగర్ అహ్లావత్‌ను మోదీ అభినందించారు. ‘అతడి ఆట భారతదేశం పవర్‌హౌస్‌లలో ఒకటి. తన విజయం యువ తరం బాక్సర్‌లకు స్ఫూర్తినిస్తుంది. రాబోయే కాలంలో భారతదేశం గర్వపడేలా చేయడం కొనసాగించాల’ని ప్రధాని అన్నారు.
జులై 28న ప్రారంభమైన 2022 కామన్వెల్త్ గేమ్స్ నేటితో అంటే ఆగస్టు 8న ముగియనున్నాయి. మొత్తం 72 దేశాలకు చెందిన అథ్లెట్లు ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ఈరోజు మరికొన్ని సోర్ట్స్‌లో ఇండియన్ అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఆ తర్వాతే మెడల్ లిస్ట్‌లో ఇండియా ఏ ప్లేస్‌లో నిలుస్తుందో తెలియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Commonwealth Game 2022, Pm modi, Women's Cricket