హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Summit:‘ప్రధాని మోదీ హీరో నంబర్ 1’! రైజింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

Rising India Summit:‘ప్రధాని మోదీ హీరో నంబర్ 1’! రైజింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

Rising India Summit: ‘ప్రధాని మోదీ నా హీరో నంబర్ 1’.. రైజింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

Rising India Summit: ‘ప్రధాని మోదీ నా హీరో నంబర్ 1’.. రైజింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ మాట్లాడుతూ, తన జీవితంలో అతిపెద్ద హీరో ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో అతిపెద్ద హీరో ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పారు. సదస్సులో పాల్గొన్న సందర్భంగా పీయూష్‌ను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, మోదీ తన హీరో నంబర్ 1 అని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాని కింద పని చేయడం తనకు దక్కిన గౌరవం, ప్రత్యేకత అని తెలిపారు.

న్యూస్ 18 రైజింగ్ ఇండియా కాంక్లేవ్:

న్యూఢిల్లీ, తాజ్‌ ప్యాలెస్‌లో జరుగుతున్న న్యూస్ 18 రైజింగ్ ఇండియా కాంక్లేవ్ థర్డ్‌ ఎడిషన్‌లో ఆయన పాల్గొన్నారు. న్యూస్ 18కి ప్రతినిధి అమిష్ దేవగన్‌తో జరిగిన స్పెషల్ కన్వర్జేషన్‌లో పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో అతిపెద్ద హీరో గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మోదీ కింద పని చేయడం తన అదృష్టంగా చెప్పారు.

మోదీ నాకు హీరో నంబర్ 1:

అదే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌(Importance Of Leadership)గురించి మాట్లాడారు.‘ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మంది హీరోలు ఉంటారు. ఒకరి భావజాలాన్ని మాత్రమే అనుసరించడం మంచిది కాదు. ఈరోజు నేను ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేస్తున్నాను. మోదీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఆయనే నాకు స్ఫూర్తి, నేను ఒక హీరోని గుర్తించాలంటే, మోదీ నాకు హీరో నంబర్ 1’ అని చెప్పారు. ‘హీరోగా మోదీపై కొన్నేళ్లుగా ఆరాధన పెరిగింది. మీరు హీరోని ఒక వ్యక్తిగా లేదా భావజాలంగా భావిస్తే అది అన్యాయం. జీవితంలో చాలా మంది హీరోలు ఉన్నారు. మీ దారిని అడ్డగించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు’ అని ఆయన చెప్పారు.

RSS నుంచి ప్రేరణ:

‘నేను చిన్నప్పటి నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి ప్రేరణ పొందాను. ఆయన కింద పని చేయడం, ఆయన నుంచి నేర్చుకోవడం నాకు గౌరవంగా ఉంది. నేను చాలా మంది RSS నాయకుల నుంచి కూడా ప్రేరణ పొందాను’ అని పీయూష్ గోయల్ చెప్పారు. తనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభావం కూడా చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు.

రాహుల్ పై విమర్శలు:

భారత్‌లో ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా పీయూష్ గోయల్ స్పందించారు. రాహుల్ మొత్తం ఓబీసీ కమ్యూనిటీని అవమానించారని ఆరోపించారు. ఇటీవల ‘మోదీ ఇంటిపేరు’ వివాదం గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పలేదని, మొత్తం OBC కమ్యూనిటీని కూడా అవమానించారని విమర్శించారు. ఆయా సంస్థల సమగ్రతపై ప్రశ్నలను లేవనెత్తడం, సంస్థలపై ఒత్తిడి తీసుకురావడమే కాంగ్రెస్ వ్యూహమని పియూష్ గోయల్ చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉందన్నారు గోయల్. ఈశాన్య రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ఉత్తమ ఉదాహరణ అని చెప్పారు.

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా అని అడిగిన ప్రశ్నకు, అవినీతిపరులు ప్రమాదంలో ఉన్నారని నేను నమ్ముతున్నానని చెప్పారు. అదానీ కేసులో కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ లేదని, రుజువులు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఆధారాలుంటే కేసు పెట్టాలన్నారు.

న్యూస్18 నెట్‌వర్క్ తన ప్రీమియర్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ - రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023 ఎడిషన్ కోసం పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ది హీరోస్ ఆఫ్ రైజింగ్ ఇండియా’ అనేది ఈ సమ్మిట్ థీమ్. విశేషమైన విజయాలు సాధించిన వ్యక్తుల అసాధారణ విజయాలను ఈ సదస్సు హైలైట్ చేస్తుంది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది.

First published:

Tags: Narendra modi, Piyush Goyal

ఉత్తమ కథలు