Modi in Varanasi: వారణాసిలో మోదీకి ఘన స్వాగతం...కాసేపట్లో విజయోత్సవ ర్యాలీ...

Modi in Varanasi: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. తనను రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించిన వారణాసి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 27, 2019, 11:08 AM IST
Modi in Varanasi: వారణాసిలో మోదీకి ఘన స్వాగతం...కాసేపట్లో విజయోత్సవ ర్యాలీ...
కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేస్తున్న మోదీ (Image : Twitter / ANI)
  • Share this:
లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచీ రెండోసారి ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ...నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసి చేరుకున్నారు. లక్నో విమానాశ్రయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికింది. ఈ ఎన్నికల్లో మోదీ... తన సమీప ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి షాలినీ యాదవ్‌పై 4.7 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించిన వారణాసి ప్రజలకు  ధన్యవాదాలు తెలిపేందుకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా... 5 కిలోమీటర్ల భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించబోతోంది బీజేపీ. ఇందుకోసం కనీ వినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారక్కడ. ప్రధాని మోదీ ఫొటోలతో కూడిన బ్యానర్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.



తన నియోజకవర్గ ఎంపీ... ప్రధాన మంత్రి అవ్వడం తమకెంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు ఓ స్థానికుడు.

 


ఐదేళ్లలో వారణాసిలో చాలా అభివృద్ధి పనులు జరిగాయన్న మరో అభిమాని... నెక్ట్స్ ఐదేళ్లు కూడా మోదీ ఇలాగే అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.



 

ఈ నెల 30న రాత్రి 7 గంటలకు మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రధాన పూజారి ఆచార్య అశోక్ ద్వివేదీ, మోదీ తరపున ప్రత్యేక పూజలు చేశారు.



2014లో కూడా విజయం తర్వాత మోదీ ఇక్కడ పూజలు చేశారు. మళ్లీ ఇప్పుడు మోదీ ఆలయ దర్శనానికి వెళ్లారు.



 



ఆలయ దర్శనం, పూజల తర్వాత మోదీ... దీన్ దయాళ్ హస్తకళా సంకుల్‌లో ... బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

ఇవి కూడా చదవండి :

టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....

నేడు తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి...

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published: May 27, 2019, 8:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading