ప్రధాని అయినా... పార్టీ కార్యకర్తనే... ఏపీ, తెలంగాణ ప్రజలు శాంతితో లేరు : వారణాసిలో మోదీ

ప్రధాని మోదీ

PM in Varanasi : వారణాసి ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని మోదీ... కార్యకర్తల విశ్వాసమే తనను గెలిపించిందన్నారు.

  • Share this:
వారణాసిలో రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించిన ప్రధాని మోదీ... బీజేపీ విజయోత్సవ ర్యాలీలో వారణాసి ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం టాయిలెట్లు నిర్మించిందనీ, ఇళ్లు కట్టి ఇచ్చిందనీ, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందనీ చెప్పిన మోదీ... వాటితోపాటూ కార్యకర్తల కృషి, పట్టుదల, విశ్వాసం వల్లే ప్రభుత్వం తిరిగి ఏర్పాటైందన్నారు. పారదర్శకత, కృషికి ప్రత్యామ్నాయం లేదన్న మోదీ... అలాంటి పరిపాలన అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వం వ్యూహాలు రచిస్తుందన్న మోదీ... పార్టీ... రణనీతిని బోధిస్తుందన్నారు. దేశంలో రాజ నీతి రోజురోజుకూ తగ్గిపోతోందన్న మోదీ... బీజేపీ కార్యకర్తల్ని కొడుతున్నారనీ, చంపేస్తున్నారనీ ఆవేదన చెందారు. పార్టీని చిన్న చూపు చూస్తూ... కార్యకర్తల్ని అంటరాని వాళ్లలా చూస్తున్నారని ప్రత్యర్థులపై మండిపడ్డారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విభజన ప్రక్రియ సక్రమంగా జరగలేదన్న మోదీ... ఇప్పటికీ ఆ రాష్ట్రాల ప్రజలు అశాంతితో బతుకుతున్నారని అన్నారు. బీజేపీ మాత్రం జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ను ఎలాంటి అశాంతీ లేకుండా విభజించామని అన్నారు. బీజేపీ పక్షాలు ఏకపక్షంగా, ఐకమత్యంతో ఉంటే... ప్రతిపక్షాలు బలహీనపడటం ఖాయమన్నారు మోదీ. త్రిపురలో బీజేపీ వచ్చాక, ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందన్నారు. దేశం ముందుకి వెళ్లాలంటే... బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటు బ్యాంక్ రాజకీయాలకు తాము పాల్పడబోమన్న మోదీ... నిస్పక్షపాతంగా పరిపాలిస్తున్నామని అన్నారు. అన్ని వర్గాలకూ మేలు జరగాలన్న ఉద్దేశంతోనే రిజర్వేషన్లు ఇస్తున్నామని అన్నారు.

 

ఇవి కూడా చదవండి :

నిజామాబాద్‌ను వీడే ప్రసక్తే లేదు... బీజేపీకి కవిత వార్నింగ్...

కులం పేరుతో ర్యాగింగ్... ముంబైలో లేడీ డాక్టర్ ఆత్మహత్య...

టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....
First published: