MODI HYDERABAD TOUR PM MODI ATTENDS PROGRAMME ON COMPLETION OF 20 YEARS OF INDIAN SCHOOL OF BUSINESS PAH
PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటన.. ఐఎస్బీ 20 వ వార్షికోత్సవంలో కీలక ఉపన్యాసం..
ఐఎస్బీ లో ప్రసంగిస్తున్న మోదీ
Indian School of Business: ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్ లోని ఐఎస్బీ 20వ వార్షికోత్సవం సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Modi hyderabad tour: దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్బీ 20వ వార్షికోత్సవ (ISB 20 years programme) సమావేశంలో పాల్గోన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి ముచ్చటించారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులకు మోదీ బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ (PM Modi) మాట్లాడుతూ.. దేశంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business)నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు, ప్రపంచంలో అనేక రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. వీరు అనేక విదేశీ కంపెనీలకు సీఈవోలుగా పనిచేస్తున్నారని అన్నారు.
అదే విధంగా అనేక స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని మోదీ విద్యార్థులను కొనియాడారు. దాదాపు 50 వేల మంది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ట్రైన్ అయ్యారని అన్నారు. జీ 20 దేశాలన్నింటిలోను, భారత్ అత్యంత వేగ వంతంగా డెవలప్ అవుతుందని అన్నారు. స్మార్ట్ సిటీలు అత్యంత వేగంగా డెవలప్ అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశం ఇంటర్నేట్ యూజర్స్ లో తొలి స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా, గ్లోబర్ రిటైల్ ఇండేక్స్ విభాగంలో రెండవ స్థానంలో ఉందన్నారు.
India is at the first position in smartphone data consumption, and at 2nd position in number of internet users in the world. It's at 2nd position in the global retail index while having the world's 3rd biggest startup ecosystem & 3rd biggest consumer market: PM Modi pic.twitter.com/ZPRzPWoiNx
భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద వినియోగ దారు అని పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు తయారీ, ఉత్పత్తి, సప్లై ప్రతి ఒక్కరంగంలో తమ కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరంగంలో భారత్ విద్యార్థులు గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఐఎస్బీ ఆసియాలోనే టాప్ స్కూల్ అని అన్నారు. దాదాపు గొప్ప వారంతా ఐఎస్బీ (ISB) నుంచి వచ్చిన వారే అని అన్నారు. విద్యార్థులను మోదీ తన ప్రసంగంలో ప్రశంసించారు. విద్యార్థులపై తనకు నమ్మకం ఉందని, మీరు ఇంకా గొప్ప స్థానాల్లో చేరుకుంటారని మోదీ అన్నారు. ఈ క్రమంలతో మోదీ హైటెక్స్ లో తన పర్యటన ముగించుకున్నారు. ఆ తర్వాత.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో మోదీ రోడ్డు మార్గం ద్వారా బేగంపేటకు చేరుకున్నారు. అక్కడి ప్రత్యేక విమానంలో మోదీ చెన్నై చేరుకొనున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.