• Home
 • »
 • News
 • »
 • national
 • »
 • MODI HELPS PEOPLE WHEN THEY ARE DISTRESSED SOFT SIDE OF PM NARENDRA MODI PLAYS SANTA FOR MANY IN DIFFICULT TIME SK

Opinion: ఆపద్బాంధవుడు.. ప్రజల కన్నీళ్లను తుడిచే మహా నాయకుడు నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

Narendra Modi: ప్రధాని మోదీ ఫోన్ చేస్తారని రూబికా అస్సలు ఊహించలేదు. రూబికా జీ.. ఈద్ ముబారక్ అని మోదీ చెప్పారు. ఐతే తన తల్లి అరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పడంతో ఆమె పరిస్థితి గురించి ప్రధాని ఆరా తీశారు. ఆ తర్వాత మీ అమ్మ గారితో మాట్లాడతాను ఫోన్ ఇవ్వండి అని అన్నారు.

 • Share this:
  (బ్రజేష్ కుమార్ సింగ్,  మేనేజింగ్ ఎడిటర్ నెట్‌వర్క్ 18 గ్రూప్)

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రేమ, అప్యాయత ఉండవని.. కఠిన హృదయమని ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు ఒక ముద్రవేశారు. ప్రధాని కన్నీరు రాల్చినా అందులో కూడా రాజకీయాలు వెతుకుతారు. కానీ అది ఎంత మాత్రమూ నిజంకాదు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షలాది మందికి అధికారికంగా.. వ్యక్తిగతంగా.. ఎన్నోసార్లు సాయం చేశారు. కష్టసమయంలో అండగా నిలిచారు. వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారు. ఇలాంటివి ఎన్నోఉన్నా పెద్దగా బయటకు కనిపించలేదు. నరేంద్ర మోదీకి స్వతహాగా పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. ఈ సమాజం ఎలా స్పందిస్తుందో.. మోదీ ఎలా తీసుకుంటారోన్న ఉద్దేశంతో.. ఆయన ప్రేమ, సాయం పొందిన వారు కూడా బయటకు చెప్పుకోరు.

  ఇటీవల టీవీ యాంకర్, జర్నలిస్ట్ రూబిక లియాఖత్ ప్రధాని మోదీ గురించి ఓ ట్వీట్ చేశారు. కష్ట సమయంలో తనకు అండగా నిలినచినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. రూబిక తల్లి డాక్టర్.ఫాత్మా లియాఖత్ మే 28న మరణించారు. ఆమె మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. కేవలం సంతాపం మాత్రమే ప్రకటించటేదు. ఆమె వ్యక్తిత్వం గురించి వివరిస్తూ లేఖరాశారు. రుబికా నేను కలిసి పలు ఛానెళ్లలో కలిసి పనిచేశాం. రూబిక తల్లి అనారోగ్యానికి గురైందని తెలిసి నేను ఓసారి కాల్ చేశా. అప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖ గురించి.. వారి కుటుంబానికి ఆయన చేసిన సాయం గురించి తెలిసింది.

  రూబికాకు ప్రధాని మోదీ లేఖ


  మే 2న రూబిక తల్లి ఫాత్మా ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయం తెలిసిన వెంటనే రూబిక తన తల్లిని చూసేందుకు ఉదయ్‌పూర్ వెళ్లిపోయారు. రూబిక తల్లి ఫాత్మా బయోలాజికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. సముద్ర జీవులపై హానిక లోహల ప్రభావంపై పరిశోధన చేస్తున్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం వల్ల గ్యాస్ట్రోఎంటరిటిస్‌ వచ్చిందేమోనని మొదట రూబిక భావించారు. కానీ క్రమంగా ఆమె పరిస్థితి విషమించింది. మూత్రపిండాలు, కాలేయం, గుండె దెబ్బతిన్నాయి. కరోనా సమయంలోనే ఇలా కావడంతో అది కూడా అయి ఉండవచ్చని అనుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి తర్వాత ఆమెకు పాంక్రియాటైటిస్ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. క్లోమం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. తండ్రి లియాఖత్ అమర్‌ను ఇంటికి పంపించి.. రుబికాతో పాటు ఆమె చెల్లి అంజుమ్ ఉదయ్‌పూర్‌లోని పరాస్ జేకే ఆస్పత్రిలో తల్లితో పాటు ఉన్నారు.

  మే 14 రోజున ముస్లింలంతా రంజాన్ పండగ జరుపుకున్నారు. కానీ వీరి కుటుంబంలో ఆ సంతోషం లేదు. ఆ రోజు రూబికా ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. స్క్రీన్‌పై నో కాలర్ ఐడీ అని ఉంది. ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది. లిప్ట్ చేయాలా? వద్దా? అని సంశయిస్తూనే కాల్ రిసీవ్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు మీతో మాట్లాడతారు..అని అవతలి వ్యక్తి చెప్పారు. ప్రధాని మోదీ ఫోన్ చేస్తారని రూబికా అస్సలు ఊహించలేదు. రూబికా జీ.. ఈద్ ముబారక్ అని మోదీ చెప్పారు. ఐతే తన తల్లి అరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పడంతో ఆమె పరిస్థితి గురించి ప్రధాని ఆరా తీశారు. ఆ తర్వాత మీ అమ్మ గారితో మాట్లాడతాను ఫోన్ ఇవ్వండి అని అన్నారు. కానీ ఫాత్మా ఫోన్ కాల్ మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. ఐతే మీరు బాధపడవద్దని.. అమ్మ త్వరగా కోలుకుంటుందని ధైర్యం చెప్పారు మోదీ. దాదాపు 7 నిమిషాల పాటు రూబికాతో మాట్లాడారు. ఆ తర్వాతి రోజు నుంచి పీఎంవో నుంచి కాల్స్ వచ్చేవి. రూబిక తల్లి ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసేవారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ డాక్టర్ ఎస్. కే. సారిన్.. ఉదయ్ పూర్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడేవారు. ఇంత పెద్ద డాక్టర్లు సాయం చేస్తున్నాని వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డీసీజీఐ కూడా అవసరమైన మందులను ఏర్పాటు చేసంది. అలా 26 రోజల పాటు ఫాత్మా జీవించి ఉన్నారు. ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే మే 28న కన్నుమూశారు. ఫాత్మాను కాపాడేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. కానీ చివరకు ఆమె ప్రాణాలు దక్కలేదు.

  ఎప్పటికీ మరచిపోను

  తన తల్లి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేసిన తీరును రూబికా ఎప్పటికీ మరచిపోలేదు. మోదీ పట్ల ముస్లింలకు ఎలాంటి చెడు అభిప్రాయం ఉందో ఆమెకు తెలిసింది. రూబికాతో ప్రధాని మోదీకి పెద్దగా పరిచయం లేదు. 2019లో సౌదీ యువాజు మహమ్మద్ బిన్ సులేమాన్ వచ్చిన సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి అందరి జర్నలిస్టుతో పాటే ఆమెకూ ఆహ్వానం అందింది. అంతేతప్ప ముందు ఎలాంటి పరిచయం లేదు. ఐనప్పటికీ ఆమెకు సాయం చేశారు ప్రధాని మోదీ.

  ముస్లింల వ్యతిరేకి కాదు

  ముస్లిం సమాజం పాలిట నరేంద్ర మోదీ విలన్ అన్న ముద్ర ఎప్పటి నుంచో ఉంది. మోదీని చూసి ముస్లింలు చూసి భయపడతారన్న ప్రచారం ఉంది. కానీ రూబికా, ఆమె ఫ్యామిలీ మోదీలో కొత్త వ్యక్తిని చూశారు. రూబిక తల్లి మరణించిన తర్వాత ఆమెకు ప్రధాని మోదీ లేఖ రాశారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కేవలం సానుభూతి చెప్పడం కాదు.. వారి గుండెల నుంచి వస్తున్న కన్నీటిని తుడిచే ప్రయత్నంచేశారు. ప్రధాని మోదీ తన బిజీ షెడ్యూల్‌లోనూ రూబికాకు లేఖ రాయడం ఆయన గొప్పతనం. తమ కుటుంబానికి ప్రధాని మోదీ చేసిన సాయాన్ని రూబీకా ఎప్పటికీ మరచిపోలేదు. ఆ తర్వాత రూబికా కూడా ప్రధాని మోదీకి లేఖరాశారు. కష్ట కాలంలో తమకు సాయంచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

  ప్రధాని మోదీకి రూబికా లేఖ


  పబ్లిసిటీ ఇష్టం ఉండదు


  కేవలం రూబికానే కాదు.. ఇలా వందలాది మందికి ప్రధాని మోదీ సాయం చేశారు. కానీ ప్రధాని మోదీకి పబ్లిసిటీ అంటే నచ్చదు కనుక ఆయన సాయం పొందిన వారు బయటకు చెప్పుకోరు. మనదేశ సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్  కూడా ఇదే తరహా అనుభవం ఎదురయింది. ఏప్రిల్లో ఉదయ్ భార్య స్మితా మహూర్కర్ కరోనా బారినపడ్డారు. ఆక్సిజన్ స్థాయులు దారుణంగా పడిపోయాయి. 95 ఉండాల్సిన చోట 55 మాత్రమే ఉంది. అది అత్యంత విషమ పరిస్థితి. అప్పుడు ఢిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన భార్యను ఆదుకోవాల్సిందిగా ప్రధాని మోదీ పీఏకి ఉదయ్ మహూర్కర్ కాల్ చేసి చెప్పారు. ఆయన వెంటనే ప్రధాని మోదీకి చెప్పారు. ఉదయ్  భార్య వైద్య చికిత్సకు అవసరమైన సాయం చేసేందుు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. కాసేపటికే ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి సూపరింటెండ్ నుంచి ఉదయ్ మహూర్కర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఏప్రిల్ 7న ఆస్పత్రిలో చేరిన స్మిత.. ఏప్రిల్ 26న కరోనా నుంచి కోలుకున్నారు. మరో 19 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ రెండు సార్లు స్వయంగా ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత పీఎంవో సిబ్బంది ఎప్పటికప్పుడు  ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేవారు. అంతేకాదు గత ఏడాది ఉదయ్ తండ్రి మరణించినప్పుడు కూడా ప్రధాని మోదీ స్వయంగా కాల్ చేసి ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీ పరిపాలన గురించి మహూర్కర్ ఇప్పటికే రెండు పుస్తకాలు రాశారు. కష్టాల్లో ఉన్న వారికి మోదీ ఎలా సాయం చేశారో ఆయనకు బాగా తెలుసు. కేవలం మనుషులే కాదు.. గ్లూకోమాతో బాధపడుతున్న వేలాది జంతువులకూ ప్రాణం పోశారు నరేంద్ర మోదీ.

  కరోనా వేళ వేలాది మందికి ఫోన్
  కరోనా సమయంలో వేలాది ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ కాల్ చేశారు. ఆ సమయంలో అది రాజకీయంగా ఏ విధంగానూ మైలేజ్ రాదు. ఐనప్పటికీ తన బాధ్యతగా ఎంతో మందితో మాట్లాడి కష్టకాలంలలో వారికి ధైర్యం చెప్పారు. కరోనా బారినపడిన ఎంతో మంది సంఘ్ ప్రచారక్‌లతో మోదీ మాట్లాడారు. ప్రవీణ్భాయ్ ఓటియా, ముకుంద్‌రావ్ డియోభంకర్, భగీరథ్ భాయ్ దేశాయ్, హరీష్‌భాయ్ రావల్‌ వంటి వారికి ఫోన్ చేసిన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఇలా ఒక్కరా ఇద్దరా.. వేలాది మంది ఉన్నారు.

  ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్ కూడా ఇలాంటి అనుభవాన్నే పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే ఓ ఇంగ్లీష్ దినపత్రికలో రెసిడెంట్ ఎడిటర్‌గా ఆయన పనిచేస్తారు. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆ జర్నలిస్ట్ అనారోగ్యం బారినపడినప్పుడు ప్రధాని మోదీ కాల్ చేసి మాట్లాడారు. ఈయన ఎన్నోసార్లు ప్రధాని మోదీ పాలనపై విమర్శనాత్మక కథనాలు రాశారు. ఐనా ఆయనకు సాయం చేయడం ప్రధాని మోదీ గొప్పతనం.

  మీడియాలో ప్రముఖ వ్యక్తికి సాయం

  నరేంద్ర మోదీ తన సేవా గుణంతో ఎన్నోసార్లు ఎంతో మందికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.  మోదీని గుడ్డిగా వ్యతిరేకంగా ఓ ఎడిటర్-జర్నలిస్ట్‌కు కూడా సాయం చేశారు. కష్ట సమయంలో ఆదుకున్నారు. ఆ జర్నలిస్ట్ జేఎన్‌యూలో చదువుకున్నారు. వామపక్ష భావజాలం కలిగిన విలేఖరి. ఒక ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్‌కు ఆసియా ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేశారు. అలాంటి ప్రముఖ జర్నలిస్టు కష్టాలను తీర్చారు ప్రధాని మోదీ. 2019 ఆగస్టులో ఆయన తండ్రి మరణించినప్పుడు నరేంద్ర మోదీ కాల్ చేసి సంతాపం ప్రకటించారు. మోదీ ఫోన్ చేస్తారని ఆయన అస్సలు ఊహించలేదు. ఎవరో తన కొలీగ్ చేశారనుకొని లిఫ్ట్ చేయగా.. అవతలి నుంచి మోదీ మాట్లాడడంతో ఆయన షాక్ తిన్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

  జర్నలిస్టు ప్రాణం కాపాడిన మోదీ
  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇలాంటివి చేయలేదు. గతంలో గుజరాత్  ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వేలాది మందిని ఆదుకున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ నిర్ణయ్ కపూర్ 2004లో నరేంద్ర మోదీ తన ప్రాణాలను ఎలా కాపాడారో.. ఇప్పటికీ ఆయన మరిచిపోలేరు. అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు.  అది జనవరి 20, 2004.  ఆ రోజు నిర్ణయ్ కపూర్ తన  కెమెరామె‌న్ ఉమేష్ చౌహాన్‌తో పాటు భుజ్ పట్టణంలో ఉన్నారు. 2001 జనవరి 26న భారీ  భూకంపం భుజ్‌లో విధ్వంసం సృష్టించింది. మూడేళ్ల తర్వాత భుజ్ ఎలా కోలుకుందో.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో కవరేజీ ఇవ్వడానికి వారు వెళ్లారు. తన ఛానెల్‌లో లైవ్ రిపోర్టింగ్ చేసేందుకు అంతా సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా  నిర్ణయ్‌కు ఛాతీనొప్పి వచ్చింది. ఆయన వెంటనే తన డాక్టర్‌కి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిర్ణయ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు డాక్టర్ గ్రహించారు. యాంటీకోగులెంట్ మందు ఇచ్చారు. కానీ ఇక్కడ ఉంటే ప్రమాదమని ఆయన ఊహించారు. ఆ తర్వాత సదరు ఛానెల్ నుంచి కాల్ రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. హెడ్ ఆఫీస్‌లో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మకు మోదీతో పరిచయం ఉంది. ఆయన వెంటనే కాల్ చేసి విసయాన్ని చెప్పారు. నరేంద్ర మోదీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అహ్మదాబాద్లోని స్టెర్లింగ్ హాస్పిటల్‌ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని విమానంలో పంపించారు. అక్కడి నుంచి నిర్ణయ్‌ను అహ్మదాబాద్ తీసుకొచ్చి వైద్యం అందించారు. అలా నరేంద్ర మోదీ సకాలంలో స్పందించడంతో  నిర్ణయ్ ప్రాణాలతో బయటపడ్డారు.

  ఆ రోజు నరేంద్ర మోదీ సాయం చేయకుంటే, తాను ఇప్పుడు ఉండేవాడని కాదన్న విషయాన్ని 17 ఏళ్ల తర్వాత కూడా మరవలేదు నిర్ణయ్. 2002 గోద్రా అల్లర్ల తర్వాత మీడియా మొత్తం మోదీకి వ్యతిరేకంగా మారిపోయింది. అలాంటి సమయంలో జర్నలిస్టుకు ఆయన సాయం చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ మోదీ మాత్రం తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా మానవీయ కోణంలో విలేఖరి ప్రాణాలు కాపాడారు.

  PM Modi Joins CBSE Session With Students and Parents here full details, CBSE, CBSE Students, PM Modi, Modi interaction with students, PM Modi, పీఎం మోదీ, ప్రధాని మోదీ, సీబీఎస్ఈ, ఎగ్జామ్స్, విద్యార్థులతో మోదీ
  నరేంద్ర మోదీ (image credit - twitter)


  ఆపదలో ఉన్నప్పుడు నన్నూ ఆదుకున్నారు...
  నరేంద్ర మోదీలోని మరో కొత్త కోణం 2004 మార్చి తర్వాత నాకు తెలిసింది. ఆ ఏడాది మార్చి 30న అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ పోర్బందర్ నుంచి భారత్ ఉదయ్ యాత్ర ప్రారంభించారు. యాత్ర 2వ రోజు చివరగా సబర్కాంత జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లో పర్యటించారు. ఆ రోజు  ఎండ ఎక్కువగా ఉంది. నేను కూడా ఇంతో ఇబ్బంది పడ్డాను. ఆడ్వాణీ హిమ్మత్‌నగర్‌ వచ్చే కంటే ముందే నేను అక్కడికి చేరుకున్నాను. ప్రోగ్రాం ముగిసిన తర్వాత అహ్మదాబాద్ వెళ్లిపోవాలని అనుకున్నా. కానీ ఇంకా ఆడ్వాణీ సమావేశం ప్రారంభం కాకముందే వడదెబ్బ తగిలి నా పరిస్థితి దిగజారింది. జ్వరం ఎక్కువగా ఉంది.  వాంతులు చేసుకున్నా. నేరుగా హోటల్‌కి వెళ్లిపోయా. అప్పుడు నాతో కెమెరామెన్ రామ్‌మణి పాండే ఉన్నారు.  బెడ్‌పై అలా పడిపోయి ఉన్నా. ఆ సమయంలో మోదీ పీఎ ఓంప్రకాశ్ కాల్ చేశారు. రిపోర్టర్లంతా ఉన్నారు మీరు కనిపించడం లేదేంటని అడిగారు. బాగా జ్వరంగా ఉంది..వాంతులు అయ్యాయని ఆయనతో చెప్పాను. ఆయన వెంటనే ప్రధాని మోదీకి విషయం చెప్పారు.ఆ సమయంలో ఆయన ఆడ్వాణీ వెంట ఉన్నారు.  ఐనా నాకు ఫోన్ చేసి మాట్లాడారు మోదీ. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆందోళన చెందనవద్దని, ఏం కావాలన్నా మేం చూసుకుంటామని ధైర్యం చెప్పారు. అసలు నాకు ఏమవుతుందో అర్ధం కాలేదు. కొందరు తమ భుజాలపై నన్ను తీసుకెళ్లినట్లు గుర్తు. ఆ తర్వాత ఉదయం 3 గంటలకు కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నాను. రాత్రి 10 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని.. డీహైడ్రేషన్ వల్ల స్పృహ కోల్పోయావని నర్సు చెబితే తెలిసింది. ఉదయం డాక్టర్ వచ్చి మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. కానీ నేను అహ్మదాబాద్ వెళ్లిపోతానని చెప్పాను. బయటకు వెళ్లాక మళ్లీ ఎండ దెబ్బ తగిలితే పరిస్థితి విషమిస్తుందని.. బతకడం కూడా కష్టమని డాక్టర్ నాతో చెప్పారు. గది లోపలే ఉండాలని సూచించారు.

  2010 నాటికి ఆ ఘటనను దాదాపుగా నేను మరచిపోయాను. ఇష్రత్ జహాన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాల్సి వచ్చింది.  అప్పుడు ప్రఫుల్ పటేల్‌కు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు మోదీ. ఇప్పుడు ఆయన మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2010లో శీతాకాల అసెంబ్లీ సమావేశాల సమయంలో నేను ప్రఫుల్ పటేల్‌ను కలిశాను. మిమల్ని కలవడం ఇదే తొలిసారి అని నేను చెప్పగా.. లేదు ఆరేళ్ల క్రితమే నేను మమ్నల్ని కలిశానని ఆయన నాతో అన్నారు. ఎప్పుడు కలిశారని నేను ఆశ్చర్యపోయా. 2001లో మీరు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లింది నేనే అని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఆ రోజు ఏం జరిగిందో సవివరంగా చెప్పారు. నరేంద్ర మోదీ సూచనలతో లాడ్జి నుంచి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి 2 గంటల వరకు అక్కడే ఉన్నారు. నేను బాగానే ఉన్నాను..ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పిన తర్వాతే .. ఆయన ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. నా ఆరోగ్యం గురించి మళ్లీ మోదీ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. నరేంద్ర మోదీ తనకు సాయం చేశారన్న విషయం ఇప్పటి వరకు నేను పబ్లిక్‌గా ఎక్కడా చెప్పలేదు. నేను గతంలోనే చెప్పి ఉంటే .. మోదీకి ప్రచారం కల్పించేందుకే ఇలా చెబుతున్నానని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.  ఇప్పుడు ఆయనకు ఒకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నేనేం చెప్పినా  ఎలాంటి ప్రభావం ఉండదు.   అందుకే మోదీలోని అపద్బాంధవుడి గురించి చెబుతున్నా. ప్రధాని మోదీ దూకుడు స్వభావం ఉన్న రాజకీయవేత్త మాత్రమే కాదని.. మానవత్వం కలిగిన మంచి మనిషి అని కొన్ని లక్షల మందికి ఇలానైనా తెలుస్తుంది.  ఆపదలో ఉన్న నాలాంటి  ఎంతో మందిని నరేంద్ర మోదీ ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేస్తారు.  మోదీలోని ఈ మానవీయ కోణం గురించి కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published: