Home /News /national /

MODI GOVT TABLES CRIMINAL PROCEDURE IDENTIFICATION BILL IN PARLIAMENT HOW US LIKE COLLECTION OF IRIS SCANS HELPS MKS GH

కళ్లతోనే నేరస్తుల గుర్తింపు.. కేంద్రం కీలక సంర్కరణ.. పార్లమెంట్‌లో Criminal Procedure Bill

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ప్రాథమికంగా సేకరించే ఆధారాల్లో వేలిముద్రలను కీలకంగా భావిస్తారు. కానీ అంతకంటే కచ్చితంగా నేరస్తులను గుర్తించేందుకు అమెరికా తరహా ఐరిస్ విధానాన్ని కేంద్రం సిద్దం చేసింది..

మన ఇంట్లోగానీ, ఊర్లోగానీ, దేశంలో ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ప్రాథమికంగా సేకరించే ఆధారాల్లో వేలిముద్రలను కీలకంగా భావిస్తారు. ఘటనా స్థలంలో దొరికిన వేలి ముద్రలను ప్రభుత్వ డేటా బ్యాంకులోని వివరాలతో పోల్చినప్పుడు నేరస్తుల గుర్తింపు సులవు అవుతుంది. అయితే, ఈ విధానంలో తెలివైన నేరగాళ్లను పట్టుకోవడం కష్టంగా మారింది. అందుకే క్రిమినల్ ప్రొసీజర్ చట్టంలో కేంద్రం కీలక సవరణ చేస్తున్నది. ఐరిష్ విధానంలో కంటిపాప ఆధారంగా నేరస్తులను గుర్తించగలిగే పద్దతిని ప్రవేశపెట్టనుంది. అందుకోసం పార్లమెంటులో క్రిమినల్‌ ప్రొసీజర్‌(ఐడెంటిఫికేషన్‌) బిల్- 2022 ప్రవేశపెట్టింది కేంద్రం.

అమెరికాలో 9/11 దాడుల తరువాత ఆ దేశ పోలీస్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. నేరస్తులను గుర్తించడం కోసం ఐరిష్ స్కాన్లు ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేవలం వేలి ముద్రల సహాయంతో నిందితులను గుర్తించేవారు. 2010 నుంచి న్యూయార్క్ పోలీసులు సైతం దోషులను గుర్తించడం కోసం వేలిముద్రలు కాకుండా ఇతర డేటా సేకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు.

Petrol Diesel Prices: బాబోయ్ ఇదేం బాదుడు! -ఇవాళ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..
ఇదే దిశలో తాజాగా భారత్ అడుగులేస్తోంది. 1920 నాటి ఖైదీల గుర్తింపు చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌(ఐడెంటిఫికేషన్‌) బిల్- 2022ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

* చట్టానికి విస్తృత అర్థం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు పరిధిని మరింత విస్తృతం చేయడం కోసం చట్టంలోని ‘మెజర్‌మెంట్‌’ అనే పదానికి విస్తృత అర్థాన్ని ఇవ్వనున్నారు. తాజాగా వేలిముద్రలతోపాటు రెటీనా, ఐరిస్, జీవ నమూనాలను అదనంగా జోడించనున్నారు. దీంతో ఇది దర్యాప్తులో ఏజెన్సీలకు సహాయపడనుంది. అదేవిధంగా డేటాను కేంద్ర స్థాయిలో భద్రపర్చడం వల్ల నిందితులను గుర్తించడం ఇకపై తేలిక కానుంది
ఈ బిల్లుపై NIA సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ‘‘ప్రస్తుతం దేశం ప్రగతిశీలం వైపు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఎదురు‌వుతున్న సవాళ్లను పాత పద్దతి ఆధారంగా దర్యాప్తు చేయడం కష్టతరం అవుతోంది. దీంతో దర్యాప్తులో వేగం, నాణ్యత కోసం ఆధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలి.’’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

KCR | Chinna Jeeyar: సమతామూర్తి సందర్శనకు అనుమతి రద్దు.. టికెట్ విషయంలో తగ్గేదేలేదు!


* సమాచారం సేకరించే అధికారం ఎవరికి?
దర్యాప్తులో భాగంగా నిందితుల సమాచారం, ఆధారాలు తీసుకోవడానికి దర్యాప్తు సంస్థలకు అధికారం కట్టబెట్టడం ఈ కొత్త బిల్లు ప్రధాన లక్ష్యం. హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి లేక హెడ్ వార్డెన్ స్థాయి కంటే తక్కువ లేని జైలు అధికారి ఆధారాలు తీసుకోవాల్సి ఉంటుంది. గత చట్టంలో, సబ్-ఇన్‌స్పెక్టర్లు లేదా అంతకంటే పైస్థాయి అధికారులకు మాత్రమే నిందితుల వవివరాలు తీసుకునే అధికారం ఉండేది.

చట్టం మినహాయింపు
ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. అరెస్ట్ అయిన వారిందరి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మహిళ లేదా చిన్న పిల్లలపై చేసిన నేరం లేదా ఏడేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరం మినహా మిగతా కేసుల్లో నిందితుల బయోలాజికల్ శాంపిల్స్ తీసుకోకూడదు.

Vastu Tips: ఇంట్లో ఈ 6 రకాల మొక్కలు ఉంటే డబ్బుతోపాటు శుభాలూ మీ సొంతం..


రికార్డుల నిల్వ, కొలతల సంరక్షణ, ధ్వంసం, రికార్డుల పారవేయడం తదితర అంశాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ద్వారా చేపడతారు. మొత్తం క్రైమ్ డేటాను సేకరించే NCRB, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలన లేదా ఇతర చట్ట అమలు సంస్థల నుండి కొలతల రికార్డును సేకరిస్తుంది.

CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!


కొలతల రికార్డు సేకరించిన తేదీ నుండి 75 సంవత్సరాల పాటు డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చుతారు. కొలతలు ఇవ్వడానికి నిరాకరించడం క్రిమినల్ చర్యల కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం కొలతలు తీసుకోవడానికి అనుమతించాల్సిన వ్యక్తి ప్రతిఘటించడం లేదా తిరస్కరించడం భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 186 ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని బిల్లు పేర్కొంది.

IPCలోని సెక్షన్ 186 ప్రకారం ప్రభుత్వ అధికారి తన విధి నిర్వహణకు అడ్డుపడితే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా లేదా రెండు శిక్షలు విధింవచ్చు.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Crime, NIA, Parliament, Pm modi, Terrorism

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు