Home /News /national /

MODI GOVT NOT CONSIDERING 8TH PAY COMMISSION FINANCE MINISTER PANKAJ CHAUDHARY SAYS NO 8TH PAY COMMISSION TO REVISE CENTRAL GOVT EMPLOYEES SALARIES MKS

8th Pay Commission : ఉద్యోగులకు భారీ షాక్.. 8వ వేతన సంఘంపై కేంద్రం కుండబద్దలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన వెలువడింది. 7వ వేతన సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోని స్థితిలో రాబోయే కాలానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయబోవడంలేదని కేంద్రం స్పష్టం చేసింది..

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన వెలువడింది. 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోని స్థితిలో రాబోయే కాలానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయబోవడంలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం నాడు లోక్‌సభకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర వేతన సంఘం సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా? తద్వారా జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా? అంటూ ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎంపీ దీపక్ బాజి, బీహార్ బీజేపీ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోమని ప్రకటించడం ద్వారా రాబోయే కాలానికి కూడా 7వ వేతనం సంఘం సిఫార్సులనే అమలు చేయనున్నట్లు మోదీ సర్కార్ సంకేతాలిచ్చినట్లయింది. అయితే, ప్రస్తుత కాలానికి 7వ పే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Gold Silver Rates : పసిడి ధరల షాక్ తప్పదా? -ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతంటే..


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి (1947) నుంచి ఇప్పటి వరకు ఏడు పే కమీషన్లు ఏర్పాటయ్యాయి. ఆర్థిక శాఖ పరిధిలో వ్యవహరించే పే కమిషన్లు.. ప్రతి పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ సవరించేందుకు నిర్దేశించారు. చివరిగా 7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలున్నాయి.


Freebies : ఉచిత పథకాలతో ప్రమాదం.. అవి భారత ఆర్థిక గమనాన్ని ఎలా దెబ్బతీస్తాయంటే..


కాగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా జీతాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యల గురించి కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందించారు. ఉద్యోగుల జీతాల వాస్తవ విలువలో కోతను భర్తీ చేయడానికి వీలుగా డియర్‌నెస్ అలొవెన్స్ (కరవు భత్యంత) ఇస్తున్నామని మంత్రి మరో ప్రశ్నకు బదులిచ్చారు. భారత వినియోగదారుల ధరల సూచిక కింద అంచనా వేసిన ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్టు తెలిపారు. 8వ వేతన సంఘం ఉండదన్న కేంద్రం ప్రకటనపై ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన వెలువడాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: 7th Pay Commission, Central govt employees, Employees, Monsoon session Parliament, Salaries hike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు