పుల్వామా ఉగ్రదాడిపై సమాజ్‌వాదీ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. భద్రతాదళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని..జవాన్లకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: March 21, 2019, 7:15 PM IST
పుల్వామా ఉగ్రదాడిపై సమాజ్‌వాదీ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
రాంగోపాల్ యాదవ్ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడిని సైతం రాజకీయం చేస్తున్నాయి పార్టీలు. ప్రచారంలో రెచ్చిపోయి మాట్లాడుతున్న నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి వెనక కేంద్రం హస్తముందని..ఓట్ల కోసమే జవాన్లను చంపారని ఆయన విమర్శించారు. లక్నోలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన రాంగోపాల్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ-శ్రీనగర్ రహదారిలో ఎలాంటి తనిఖీలు చేయలేదు. సాధారణ బస్సుల్లో జవాన్లను తరలించారు. పుల్వామా ఉగ్రదాడి ఓ కుట్ర. ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వమే జవాన్లను చంపింది. మోదీ సర్కార్ పట్ల భద్రతా బలగాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ కుట్ర గురించి ప్రస్తుతం ఇంతకుమించి ఏమీ మాట్లాడలేం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. పెద్ద పెద్ద నేతల పేర్లు బయటకొస్తాయి.
రాంగోపాల్ యాదవ్, ఎస్పీ నేత
కాగా, రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. భద్రతాదళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని..జవాన్లకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అటు సోషల్ మీడియాలోనూ రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 14న కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ టార్గెట్‌గా జైషే మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బాంబులు నింపిన కారుతో సీఆర్‌పీఎఫ్ బస్సును ఢీకొనడంతో భారీ పేలుడు జరిగింది. ఆ ఉగ్రదాడి ఘటనలో 45 మంది జవాన్లు అమరవీరులయ్యారు.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...