Home /News /national /

MODI GOVT APPOINTS DR V ANANTHA NAGESWARAN AS NEW CHIEF ECONOMIC ADVISOR MKS

Anantha Nageswaran: దేశానికి కొత్త ముఖ్య ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్.. బడ్జెట్ వేళ మోదీ సర్కార్ నియామకం

కొత్త సీఈఏ డాక్టర్ అనంత నాగేశ్వరన్‌

కొత్త సీఈఏ డాక్టర్ అనంత నాగేశ్వరన్‌

దేశానికి కొత్త చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ)గా డాక్టర్ అనంత నాగేశ్వరన్‌ నియమితులయ్యారు. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్‌, దానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నియామకం చేపట్టింది.

దేశానికి కొత్త చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ (సీఈఏ)గా డాక్టర్ అనంత నాగేశ్వరన్‌ నియమితులయ్యారు. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్‌, దానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది డిసెంబరులో కేవీ సుబ్రమణియన్‌ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో ముఖ్య ఆర్థిక సలహాదారు పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ స్థానంలో తమిళనాడుకే చెందిన అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

అత్యంత పకడ్బందీగా సాగే బడ్జెట్‌ తయారీలో పాలు పంచుకునే ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని నార్త్‌ బ్లాక్‌లో లాక్‌ఇన్‌లోకి గురువారం పంపింది. లాక్‌ఇన్‌ మొదలైన తర్వాత 24 గంటల్లోపే కొత్త ఆర్థిక సలహాదారును కేంద్రం నియమించడం గమనార్హం. శుక్రవారం నాడే సీఈఏగా నాగేశ్వరన్ బాధ్యతలు చేపట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కొత్త సీఈవో పదవీ బాధ్యతలు వెంటనే తీసుకుని బడ్జెట్‌ తయారీలో చేయి వేస్తారా ? లేక తర్వాత రంగంలోకి దిగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Paracetamol Kills Snakes: పారాసిటమల్‌తో పాములను చంపుతున్నారు -Dolo 650 దట్టించిన ఎలుకల్ని విసిరి..


ప్రధాన ఆర్థిక సలహాదారుగా కెవి సుబ్రమణియన్ పదవీకాలం 2021 డిసెంబర్‌తో ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానంలో కొత్త సిఇఎని నియమించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఈనెల 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో కొత్త సిఇఎ నియామకం జరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022ను కూడా ప్రవేశపెట్టనున్నారు. గడిచిన ఏడేళ్లలో పనిచేసిన ముగ్గురు ఆర్థిక సలహాదారులూ దక్షిణాదికి చెందినవారే కావడం గమనార్హం.

Omicron: మన చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికి ఉంటుందో తెలుసా? షాకింగ్ విషయాలు చెప్పిన సైంటిస్టులు..


తమిళనాడులోని మధురైకి చెందిన అనంత నాగేశ్వరన్.. 1985లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నుండి ఎంబిఎ పొందారు. ఆ తర్వాత 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. స్విట్జర్లాండ్‌లోని అనేక ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌ల పరిశోధనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఐఎఫ్‌ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి డీన్‌గా ఉన్నారు. ఇంకా కెఆర్‌ఇఎ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్‌గా చేశారు. నాగేశ్వర్ భారతదేశం, సింగపూర్‌లోని అనేక బిజినెస్ స్కూల్స్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా బోధించారు. క్రెడిట్‌ సూయిస్‌ గ్రూప్‌ ఏజీ, జూలియస్‌ బేర్‌ గ్రూప్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన నాగేశ్వరన్‌ కన్సల్టెంట్‌, రచయిత, అకాడమీషియన్‌ గానూ కొనసాగుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Indian Economy, Union Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు