Home /News /national /

MODI GOVT AMENDS FCRA RULES ALLOWS INDIANS TO RECEIVE UP TO RS10 LACK FROM RELATIVES RESIDING ABROAD MKS

Foreign Fund : విదేశీ విరాళాల పరిమితి పెంపు.. వ్యక్తులు, ఎన్జీవోలు వెంటనే చెప్పనక్కర్లేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విదేశాల నుంచి భారతీయులు, ఇక్కడి ఎన్జీవోలు నిధులు లేదా విరాళాలు పొందే విషయంలో పరిమితులను మోదీ సర్కార్ సడలించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని వివరాలివే..

దేశంలో మతమార్పిడులకు దన్నుగా ఉన్నాయనే ఆరోపణలు, ఉగ్రవాద వ్యాప్తికి మూలమనే అనుమానాలు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంస్థలకు తోడ్పాటు అందిస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో మోదీ సర్కారు విదేశాల నుంచి వచ్చే నిధులు, విరాళాలపై కఠిన పరిమితులు విధించిన సంగతి తెలసిందే. విదేశాల నుంచి విరాళాల రాక ఆగడంతో వేల సంఖ్యలో ఎన్జీవోలు ఇబ్బందుల పడటం, పలు రంగాల్లోని సంస్థలు, వాటి సేవాకార్యక్రమాలు నిలిచిపోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు అదే కేంద్రం విదేశాల నుంచి భారతీయులు, ఇక్కడి ఎన్జీవోలు నిధులు లేదా విరాళాలు పొందే విషయంలో పరిమితులు సడలించింది.

విదేశాల నుంచి విరాళాలను సేకరించడానికి వీలు కల్పించే ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ)కు కేంద్రం అనేక సవరణలు చేసింది. దీన్ని అనుసరించి విదేశాల్లోని వ్యక్తులు భారత్‌లోని తమ బంధువులకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షల వరకు పంపించవచ్చు. ఇప్పటివరకు దీని పరిమితి రూ.లక్ష మాత్రమే. ఇప్పుడు దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. అలాగే,

Maharashtra Assembly : సీఎం షిండేపై బహిష్కరణ వేటు -అసెంబ్లీ స్పీకర్‌గా రాహల్ నర్వేకర్ గెలుపు


రూ.10లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాల్లోని బంధువుల నుంచి తీసుకున్నట్టయితే.. ఆ సమాచారాన్ని కేంద్రానికి 90రోజుల్లోగా తెలపాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ గడువు 30 రోజులుగా ఉంది. అదే విధంగా విదేశీ విరాళాలను స్వీకరించడానికి ఉపయోగించే బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను 45 రోజు లు ముందుగా కేంద్రానికి తెలపాలి. ప్రస్తుతం దీని వ్యవధి 30 రోజులుగా ఉంది.

BJP | TRS : సర్కారు కూల్చివేత : కేసీఆర్‌కు బీజేపీ ప్రతిసవాల్ -నీలో తెలంగాణ నెత్తురుంటే..


విదేశాల నుంచి విరాళాలకు పరిమితి పెంపు నిబంధనలు వ్యక్తులు, సంస్థలతోపాటు ఎన్జీవోలకూ వర్తిస్తాయి. ఈ మేరకు ఎఫ్‌సీఆర్‌ఏకు సవరణలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం.. విదేశాల నుంచి విరాళాలను పంపించినవారి పేర్లు, పంపిన మొత్తం, సంబంధిత తేదీలను ఎఫ్‌సీఆర్‌ఏ వెబ్‌సైట్‌లో కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి వెల్లడించాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల్లోగా ఆడిట్‌ స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలను పొందుపరిస్తే సరిపోతుంది. ఈ వివరాలను ఎఫ్‌సీఆర్‌ఏ వెబ్‌సైట్‌ లేదా కేంద్రం పేర్కొనే ఏదైనా ఇతర వెబ్‌సైట్‌లో చేర్చాల్సి ఉంటుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Donation, Union government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు