ప్రధాని మోదీ కొత్త స్కీం... రైతులకు నెలకు రూ.3000 పెన్షన్

Modi govt scheme : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చే చాలా స్కీములు... ప్రజలకు తెలియవు. అందువల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈ స్కీం అలాంటిదే. రైతులంతా తప్పక తెలుసుకోవాల్సినది. పేరు "కిసాన్ మాన్ ధన్". దీని సంగతేంటో వివరంగా తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 9:34 AM IST
ప్రధాని మోదీ కొత్త స్కీం... రైతులకు నెలకు రూ.3000 పెన్షన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
PM Kisan Samman Nidhi to fund Kisan Maan Dhan pension scheme : చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త స్కీమ్ ఒకటి తెచ్చారు. అదే కిసాన్ మాన్ ధన్. ఇవాళే... జార్ఖండ్ రాజధాని రాంచీలో దాన్ని ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా దాదాపు 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.3000 చొప్పున పెన్షన్ అందనుంది. 60 ఏళ్లు నిండిన రైతులకు ఇది వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచీ 40 ఏళ్ల వయసున్న రైతులు... కిసాన్ మాన్ ధన్ యోజన కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీం కింద రైతులు నెలకు రూ.55 నుంచీ రూ.200 వరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఈ స్కీంలో చేరినప్పుడు వాళ్ల వయసు ఎంత ఉంటుందో, దాన్ని బట్టీ నెలకు ఎంత చెల్లించాలో అధికారులు డిసైడ్ చేస్తారు.

60 ఏళ్లు వచ్చే వరకూ... ఇలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో... అంతే డబ్బును కేంద్ర ప్రభుత్వం కూడా నెల నెలా పెన్షన్ ఫండ్‌గా వేస్తుంది. సపోజ్ 40 ఏళ్లు ఉన్న ఓ రైతు... నెలకు రూ.200 చొప్పున అంటే ఏడాదికి రూ.2,400 చొప్పున... 20 ఏళ్లు (మొత్తం రూ.48,000) చెల్లిస్తే... కేంద్రం కూడా రూ.48,000 చెల్లిస్తుంది. ఆ రైతుకు 60 ఏళ్లు రాగానే... నెలకు పెన్షన్ కింద రూ.3000 ఇస్తారు. ఇంతకంటే ఏం కావాలి. ఆ వయసులో రైతుకు ఆ డబ్బు కొంతైనా ఉపయోగపడుతుంది. నెల నెలా పెన్షన్ వస్తుంది కాబట్టి... కాస్త ధైర్యంగా జీవించవచ్చు.

పీఎం-కిసాన్ స్కీం ద్వారా లబ్ది పొందుతున్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తద్వారా... వచ్చే డబ్బులో నెల నెలా కొంత మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అయి... ప్రీమియం కిందకు వెళ్లిపోతుంది. పీఎం-కిసాన్ ఫండ్ ద్వారా ప్రీమియం చెల్లించడం ఇష్టం లేని రైతులు... కామన్ సర్వీస్ సెంటర్స్ (CSCs) ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.

పీఎం-కిసాన్ స్కీమ్ అంటే? : పీఎం కిసాన్ స్కీమ్ అన్నా... పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నా ఒకటే. ఈ స్కీం కింద రైతులు ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయాన్ని మూడ దఫాలుగా పొందుతారు. ఇది రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది.Kisan Maan Dhan Yojana: Fund manager : కిసాన్ మాన్ ధన్ పథకం ద్వారా రైతు భార్య కూడా పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. నెల నెలా ప్రీమియం చెల్లించవచ్చు. ఈ స్కీం చక్కగా అమలయ్యే బాధ్యతను LIC చూసుకుంటుంది.

కిసాన్ మాన్ ధన్ స్కీమ్ రూల్స్ :
- రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు వచ్చేలోపే రైతు చనిపోతే, ఆయన తరపున ఆయన భార్య ఆ ప్రీమియం చెల్లించి... గడువు తీరాక... పెన్షన్ పొందవచ్చు. అంటే 56 ఏళ్లకు రైతు చనిపోతే... ఆ మిగతా నాలుగేళ్లకూ ప్రీమియంని ఆయన భార్య చెల్లించి... నాలుగేళ్ల తర్వాత నుంచీ నెలకు రూ.3వేలు పెన్షన్ ఆమె పొందవచ్చు.- ఒకవేళ రైతు భార్య... తనకు పెన్షన్ స్కీమ్ వద్దని అనుకుంటే... అప్పటివరకూ రైతు చెల్లించిన మొత్తం డబ్బుకి వడ్డీతో కలిపి ఆమెకు చెల్లించేస్తారు.
- ఒకవేళ రైతుకి భార్య లేకపోతే... రైతు చెల్లించిన ప్రీమియం డబ్బు, వడ్డీ కలిపి నామినీకి చెల్లిస్తారు.
- రిటైర్మెంట్ తేదీ తర్వాత రైతు చనిపోతే, అతని భార్య 50 శాతం పెన్షన్‌ (రూ.1500)ని ఫ్యామిలీ పెన్షన్ పేరుతో పొందగలదు.
- రైతు, రైతు భార్య ఇద్దరూ చనిపోయిన తర్వాత... వచ్చే కార్పస్ ఫండ్‌ను తిరిగి పెన్షన్ ఫండ్‌లోనే కలుపుతారు.

ఐదేళ్ల తర్వాత స్కీం వదులుకోవచ్చు : ఈ స్కీంలో చేరిన వాళ్లు... కనీసం ఐదేళ్లపాటూ... నెల నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఎప్పుడైనా సరే ఈ స్కీం నుంచీ తప్పుకోవచ్చు. అప్పటివరకూ వాళ్లు చెల్లించిన డబ్బుకి, వడ్డీ లెక్క కట్టి... మొత్తం డబ్బును వాళ్లకు ఇచ్చేస్తుంది LIC.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు