Home /News /national /

MODI GOVERNMENT PLANS TO GIVE ONE CRORE MORE FREE LPG CONNECTIONS TO THE NEEDY OVER THE NEXT TWO YEARS NS GH

Free LPG Gas Connections: రానున్న రెండేళ్లలో ఫ్రీగా కోటి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ujjwala scheme: రాబోయే రెండెళ్లలో మరో కోటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, దేశంలో స్వచ్ఛమైన, 100 శాతం ఇంధనంతో గ్యాస్ యాక్సెస్ సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

నరేంద్ర మోదీ సర్కారు చేసిన సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైంది. ఉజ్వల పథకం కింద దేశవ్యాప్తంగా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తోంది. గృహ కాలుష్యాన్ని తగ్గించి మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు గాను తీసుకొచ్చిన ఈ పథకం అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకుంది. రాబోయే రెండెళ్లలో మరో కోటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, దేశంలో స్వచ్ఛమైన, 100 శాతం ఇంధనంతో గ్యాస్ యాక్సెస్ సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. చమురు కార్యదర్శి తరుణ్ కపూర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎల్పీజీ నూతన గ్యాస్ కనెక్షన్ల కోసం గుర్తింపు పత్రాలు, నివాస స్థల గుర్తింపు లాంటి వాటి కోసం పట్టుబట్టకుండా విధానాన్ని సులభతరం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే వినియోగదారులు ఒకే డీలర్ వద్ద గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి బదులుగా అందుబాటును బట్టి ముగ్గురు డీలర్ల వద్ద సిలిండర్ తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోందని అన్నారు. పేద మహిళలకు కేవలం నాలుగు ఏళ్లలో రికార్డు స్థాయిలో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించామని, ప్రస్తుతం వంటగ్యాస్ వినియోగించే వారి సంఖ్య దేశవ్యాప్తంగా 29 కోట్లకు చేరుకుందని అన్నారు.

ఇప్పటికే అదనపు కోటి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనున్నామని గత నెల ప్రారంభంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే ప్రభుత్వం పేర్కొంది. ఈ అదనపు కోటి కనెక్షన్లు రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 బడ్జెట్ లో దీని ప్రత్యేక కేటాయింపులు చేయనప్పటికీ సాధారణ ఇంధన సబ్సిడీ కేటాయింపునకు రూ.1600లు భరించనుంది. పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఉజ్వల పథకాన్ని డబ్ల్యూహెచ్ఓ 2018లో ప్రశంసించింది. తర్వత సంవత్సరంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) అభినందించింది. స్వచ్ఛమైన శక్తి వనరులు, పర్యావరణ రక్షణతో పాటు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఎల్పీజీ కార్బన్ ఫుట్ ప్రింట్ బొగ్గు కంటే 50 శాతం తక్కువ. అంతేకాకుండా కార్బన్ డై ఆక్సైడ్, బ్లాక్ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎల్పీజీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్లోబర్ వార్మింగ్ రెండో అతిపెద్ద సహాయకారిగా పనిచేస్తోంది. ఉజ్వల పథకం ప్రవేశపెట్టకముందు గృహ, పరిసర వాయు కాలుష్యం కారణంగా మరణించే వారి సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఎల్పీజీ కనెక్షన్ పొందడానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉంది. అయితే ప్రాక్టికల్ గా నివాస స్థలం రుజువు లేకుండా వంటగ్యాస్ కనెక్షన్ పొందడం కష్టం.

అయితే ఈ రకమైన ఫిర్యాదులను తొలగించాలని తాము చమురు కంపెనీలను కోరినట్లు తరుణ్ కపూర్ అన్నారు. తాత్కాలికంగా ఒక నగరం నుంచి మరొక నగరానికి మారుతున్న వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఎల్పీజీ కనెక్షన్ పొందగలగాలని, తాము ఆ దశకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ కనెక్షన్ కు ప్రాథమిక పత్రాలు, చిన్న గుర్తింపు ఉంటే సరిపోతుందని ఆయన చెప్పారు. ఆ దిశగా ఇండియన్ ఆయిల్, భారత పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోల్ అనే మూడు ఇంధన మార్కెటింగ్ సంస్థలకు ఏకీకృత సాఫ్ట్ వేర్ చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా బుకింగ్ చేసుకునేందుకు భౌతిక బుక్ లెట్ ఉంచాల్సిన పనిలేదని అన్నారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఇంటర్-కంపెనీ మైగ్రేషన్ చాలా సులభమవుతుందని, నగరాల్లో నివసించే వారికి ఒకే సంస్థకు చెందిన మూడు పంపిణీదారుల నుంచి ఎల్పీజీ రీఫిల్ కోరే అవకాశముంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Gas, LPG Cylinder, Narendra modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు