జమ్మూ కాశ్మీర్‌కు రూ.వందల కోట్లు.. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్న మోదీ..

నరేంద్ర మోదీ, అమిత్ షా (File)

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో వివిధ పథకాల అమలుకు రూ. వందల కోట్ల ప్యాకేజీని ప్రకటించనున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • Share this:
ఆర్టికల్ 370 పని పూర్తైంది.. భారత రాజ్యాంగమే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అయ్యింది.. సంచలన నిర్ణయంతో కోట్లాది భారతీయుల కలను మోదీ నెరవేర్చారు.. ఇప్పుడు ఇక, ఆ రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకం సహా అన్ని రంగాల్లో ఆ రాష్ట్రం అభివృద్ధి బాటలు పట్టించేందుకు 106కు పైగా కేంద్ర చట్టాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రెడీ అవుతున్నారు. వివిధ పథకాల అమలుకు రూ. వందల కోట్ల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌ ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్ర సర్కారు.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. అక్టోబరు 31 నుంచి ఆ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనుంది. ఈ మధ్య సమయంలో కేంద్ర, రాష్ట్ర చట్టాలు అమల్లో ఉంటాయి. అక్టోబరు 31 నుంచి పూర్తిగా కేంద్ర చట్టాల్లోకి మారేందుకు వీలుగా రూ.వందల కోట్లతో ఒక ప్యాకేజీని అందించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత వారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. కార్మిక, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, మానవ వనరుల అభివృద్ధి తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రాజెక్టులపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌ ఈఎస్‌ఐ చందాదారుల కోసం ఆస్పత్రి నిర్మించాలని, విద్యా హక్కు చట్టం అమలుకు, ఆధార్ చట్టం అమలుపై ప్రతిపాదనలు వచ్చాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published: