మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...బడి పిల్లలకు అరుదైన కానుక...

కేంద్ర ప్రభుత్వం ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా స్కూల్ డ్రాపౌట్స్ నివారించడంతో పాటు పిల్లలు సమయానికి స్కూలుకు చేరుకునే వీలుదక్కుతోంది.

news18-telugu
Updated: June 5, 2019, 12:58 PM IST
మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...బడి పిల్లలకు అరుదైన కానుక...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇకపై స్కూలుకు వెళ్లే పిల్లలకు కేవలం మధ్యాహ్న భోజనంతో సరిపెట్టకుండా, ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కూడా అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బడి పిల్లలు ఉదయం పూట పాఠశాలకు అల్పాహారం చేయకుండా వస్తున్నారని, తద్వారా చదువుపై సరిగ్గా శ్రద్ధపెట్టడం లేదని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం వేళ వ్యవసాయ కుటుంబాలు తమ పనులకు వేకువనే వెళ్లిపోతాయి. దీంతో పిల్లలు అల్పాహారం చేయకుండానే పాఠశాలకు చేరుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం వరకూ వారు ఆకలితో ఎదురు చూడాల్సి వస్తోంది. ఫలితంగా పిల్లలు ఉదయం పూట తరగతి గదిలో అంత చురుగ్గా ఉండటం లేదు. అలాగే పౌష్టికాహార లోపం కూడా పిల్లల్లో కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా స్కూల్ డ్రాపౌట్స్ నివారించడంతో పాటు పిల్లలు సమయానికి స్కూలుకు చేరుకునే వీలుదక్కుతోంది.

అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల పాఠశాలల్లో 12 కోట్ల మందికి మధ్యాహ్నభోజన పథకం అమల్లో ఉంది. వీరందరికీ ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ ప్రాజెక్టును తొలుత తమిళనాడులో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. చెన్నై గ్రేటర్ కార్పోరేషన్, అక్షయ ఫౌండేషన్ సంయుక్తంగా చెన్నై నగరంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అనంతరం దేశ వ్యాప్తంగా ఈ బ్రేక్ ఫాస్ట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
First published: June 5, 2019, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading