హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pm Modi: జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ..అధికారిక ప్రకటన రిలీజ్..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ భేటీ అయ్యే ఛాన్స్

Pm Modi: జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ..అధికారిక ప్రకటన రిలీజ్..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ భేటీ అయ్యే ఛాన్స్

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

జీ-20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను ప్రధాని కార్యాలయం రిలీజ్ చేసింది. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ  (Narendra Modi) ఇండోనేషియాకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో నేడు ప్రధాని మోదీ  (Narendra Modi) బాలీ (Bali)కి బయలుదేరనున్నారు. దాదాపు 20 భేటీల్లో ప్రధాని పాల్గొననున్నట్లు తెలుస్తుంది. కాగా ఈనెల 15,16వ తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. అయితే ఈ సదస్సులో భాగంగా ప్రధానమంత్రి మోదీ  (Narendra Modi) బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తోను భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జీ-20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను ప్రధాని కార్యాలయం రిలీజ్ చేసింది. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ  (Narendra Modi) ఇండోనేషియాకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో నేడు ప్రధాని మోదీ  (Narendra Modi) బాలీ (Bali)కి బయలుదేరనున్నారు. దాదాపు 20 భేటీల్లో ప్రధాని పాల్గొననున్నట్లు తెలుస్తుంది. కాగా ఈనెల 15,16వ తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. అయితే ఈ సదస్సులో భాగంగా ప్రధానమంత్రి మోదీ  (Narendra Modi) బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తోను భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PM Modi will be attending the 17th G-20 Summit in Bali, Indonesia from tomorrow. India will hold presidency of G20 for one year starting from 1st December: Foreign Secretary Vinay Kwatra pic.twitter.com/RIYkHTmZKl

— ANI (@ANI) November 13, 2022

ఈ సదస్సు అనంతరం ప్రధాని అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఆహరం, ఆరోగ్యం వంటి కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారత జి 20 అధ్యక్ష పదవికి సంబంధించిన లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఇది దేశానికి చారిత్రాత్మక క్షణం అని అభివర్ణించారు. భారత్‌ జీ20(G20) అధ్యక్ష పదవి చేపట్టిన చారిత్రాత్మక సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. 'వసుధైవ కుటుంబం' ప్రపంచం పట్ల భారతదేశం కరుణకు ప్రతీక అని చెప్పారు. లోటస్ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రపంచాన్ని ఒకచోట చేర్చే నమ్మకాన్ని వర్ణిస్తుంది. వినాశకరమైన కోవిడ్-19 మహమ్మారి (Covid-19) ప్రభావంతో ప్రపంచం అల్లాడిపోతోందని.. అటువంటి పరిస్థితిలో G20 చిహ్నం చిహ్నం ఆశ ప్రాతినిధ్యమని చెప్పుకొచ్చారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కమలం(Lotus) వికసిస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

జి 20 లోగో కేవలం లోగో మాత్రమే కాదని, అది మన సిరల్లో ఉండే సందేశం, అనుభూతి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది ఒక తీర్మానమని.. ఇది మన ఆలోచనలో చేర్చబడిందని చెప్పారు. కమలంపై ఉన్న ఏడు రేకులు ప్రపంచంలోని ఏడు ఖండాలను, ఏడు స్వరాల సంగీతాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. G20 ప్రపంచాన్ని సామరస్యంగా తీసుకువస్తుందని తెలిపారు. ఈ లోగోలోని తామర పువ్వు భారతదేశ పౌరాణిక వారసత్వాన్ని, మన విశ్వాసాన్ని, మన తెలివిని వర్ణిస్తుందని చెప్పారు.

First published:

Tags: Pm modi

ఉత్తమ కథలు