రామ్‌ చరణ్ సతీమణి ఉపాసనపై మండిపడుతున్న నెటిజన్లు...ప్రధాని మోదీపై విమర్శలా అంటూ ఫైర్...

నిజానికి దక్షిణాదికి చెందిన కళాకారులనెవరినీ పీఎంఓ కార్యాలయం ఆహ్వానించలేదనే వాదనలో నిజం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానించిన విందుకు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు. ఈనాడు సంస్థ ఎండీ కిరణ్ హాజరైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది.

news18-telugu
Updated: October 21, 2019, 3:20 PM IST
రామ్‌ చరణ్ సతీమణి ఉపాసనపై మండిపడుతున్న నెటిజన్లు...ప్రధాని మోదీపై విమర్శలా అంటూ ఫైర్...
ఉపాసన బాటలోనే మరో నటి... మెదీని ప్రశ్నిస్తూ ట్వీట్స్
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేసుకొని మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చనడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఫాలోయర్లు ఉపాసన ట్వీట్ పై కాస్త గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ త‌న నివాసంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు ప్ర‌త్యేక‌మైన విందునిచ్చారు. ఈ వేడుకలో ఆమీర్ ఖాన్‌, షారూక్‌ ఖాన్, కంగనా రనౌత్ సహా ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. ద‌క్షిణాది నుంచి ఒక్క కళాకారుడిని కూడా ఆహ్వానిచకపోవడంపై ఉపాసన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ద‌క్షిణాది వారికి మీరంటే ఎంతో గౌర‌వం ఉంది. మీరు ప్ర‌ధానిగా ఉండ‌టం ప‌ట్ల మేం గ‌ర్విస్తున్నాం. గొప్ప వారిని గుర్తు చేసే కార్య‌క్ర‌మాలు కేవ‌లం బాలీవుడ్ న‌టీన‌టులకు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అయితే నిన్నటి సమవేశంలో దక్షిణాది వారిని పట్టించుకోకపోవడం భాధించింది’అని ఆమె ట్వీట్ చేసింది.

అయితే నిజానికి దక్షిణాదికి చెందిన కళాకారులనెవరినీ పీఎంఓ కార్యాలయం ఆహ్వానించలేదనే వాదనలో నిజం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానించిన విందుకు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు. ఈనాడు సంస్థ ఎండీ కిరణ్ హాజరైనట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది. అలాగే దక్షిణాదికి చెందిన పలువురు నటులకు ఆహ్వానం అందినప్పటికీ వారంతా బిజీగా ఉండటంతో హాజరు రాలేకపోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే విషయం పూర్తిగా తెలుసుకోకుండా ప్రధాని మోదీపై విమర్శలు చేయడం తగదని నెటిజన్లు ఉపాసనపై ఫైర్ అవుతున్నారు.
First published: October 21, 2019, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading