దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోడీ భ్రష్టు పట్టించారు - ప్రియాంక గాంధీ

priyanka gandhi

 • Share this:
  ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవం హోరాహోరీగా కృషి చేస్తున్న యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగా యాత్ర మూడో రోజుకు చేరుకుంది. గంగా యాత్రలో చివరి రోజుకు చేరుకోవడంతో ప్రియాంక వారణాసి పర్యటనలో గంగానది పడవ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ప్రియాంక విమర్శలు చేశారు. ఎన్డీఏ హయాంలో వ్యవస్థలను ఏ స్థాయిలో భ్రష్టు పట్టించారో మా కన్నా మీడియాకే బాగా తెలుసన్నారు. అలాగే చాలా మంది మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకే భయపడుతుంటే.. తాము మాత్రం ఏకంగా మోడీతో పోరాటం చేస్తున్నామని ప్రియాంక తెలిపారు.

     ఇదిలా ఉంటే వారణాసి పర్యటనలో భాగంగా ప్రియాంక కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే వారణాసిలో ప్రసిద్ధ అస్సీ ఘాట్‌లో ప్రియాంక పలువురు మత్స్యకారులు, మహిళలతో ముచ్చటించారు. అనంతరం వారణాసిలో నివాసం ఉంటున్న పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలను ప్రియాంక పలకరించారు. దీంతో పాటు పుల్వామా ఘటన నేపథ్యంలో హోలీ వేడుకలకు సైతం ప్రియాంక దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.

   

   
  First published: