హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: గుజరాత్ ఘటనలో చనిపోయిన వారికి మోదీ సంతాపం.. సహాయక చర్యల్లో అలసత్వం ఉండదని భరోసా

PM Modi: గుజరాత్ ఘటనలో చనిపోయిన వారికి మోదీ సంతాపం.. సహాయక చర్యల్లో అలసత్వం ఉండదని భరోసా

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

గుజరాత్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాన నరేంద్ర మోదీ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ అనుభవించలేదని చెప్పారు.

  • Trending Desk
  • Last Updated :
  • Gujarat, India

గుజరాత్‌లోని(Gujarat) మోర్బీ నగరంలో ఆదివారం సాయంత్రం అత్యంత ఘోరమైన వంతెన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కనీసం 130 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన వందలాది మందికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘోర విషాదం గురించి తెలుసుకుని మనదేశ ప్రముఖులతో సహా విదేశీ ప్రధానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రధాన నరేంద్ర మోదీ ( Narendra Modi) కూడా ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ అనుభవించలేదని చెప్పారు.

సోమవారం ఉక్కుమనిషి సర్దార్ వల్లబ్‌భాయ్‌ పటేల్ 147వ జయంతి సందర్భంగా జరిగిన ఓ సభలో ప్రధాని ప్రసంగిస్తూ మోర్బీ దుర్ఘటనను గుర్తుచేసుకున్నారు. ఈ సభలో భావోద్వేగానికి లోనైన మోదీ మృతులకు సంతాపం తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. రెస్క్యూ, సహాయక చర్యలలో ఎలాంటి అలసత్వం ఉండదని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గత రాత్రి మోర్బీకి చేరుకున్నారని, నిన్నటి నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారని ప్రధాని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియా (Kevadia)లోని ఏక్తా నగర్‌లో మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మృతుల కుటుంబాలకు అండగా ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం నిన్నటి నుంచి సహాయ, సహాయక చర్యలు చేపడుతోంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోంది.’’ అని మోదీ అన్నారు.

తాను ఏక్తా నగర్‌లో ఉన్నా తన మనసు మాత్రం మోర్బీ బాధితులపైనే ఉందని మోదీ ఎమోషనల్‌గా మాట్లాడారు. తన జీవితంలో ఈ ఘటనే అత్యంత బాధను కలిగించిందని పేర్కొన్నారు. ఒకవైపు గుండె నిండా విషాదం నింపుకున్నా.. తప్పక నిర్వహించాల్సిన విధులు ముందు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా మోదీ మంగళవారం మధ్యాహ్నం మోర్బీ కేబుల్ వంతెన కూలిన ప్రదేశాన్ని సందర్శించి బాధితులను పరామర్శించనున్నారని సమాచారం.

Apple iPhone: వజ్రాలతో కూడిన iPhone.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

మరోవైపు మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కూలిపోయేటప్పుడు రికార్డ్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఇంకొందరు ఆకతాయిలు బ్రిడ్జిని ఊపుతూ కనిపించారు. బ్రిడ్జి నిర్వాహకులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన వారి పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు మానవ తప్పిదాలే కారణమని తెలుస్తోంది.

First published:

Tags: Accident, Gujarat, Pm modi

ఉత్తమ కథలు