MODI AT BIMSTEC MODI SAYS REGIONAL SECURITY IS A PRIORITY IN LIGHT OF EUROPEAN CONDITIONS PM ADDRESSES BIMSTEC CONFERENCE GH VB
Modi At BIMSTEC: ప్రాంతీయ భద్రతకే అధిక ప్రాధాన్యం.. BIMSTEC సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం..
ప్రధాని మోదీ (ఫైల్)
బుధవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన ఏడు దేశాల BIMSTEC (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతకు ప్రాధాన్యం కల్పించాల్సిన ఆవశ్యకతను మోదీ వివరించారు.
బుధవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన ఏడు దేశాల BIMSTEC (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో(Ukraine) జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతకు ప్రాధాన్యం కల్పించాల్సిన ఆవశ్యకతను మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పరస్పర సహకారం అందించుకోవడంలో కీలకమైన కనెక్టివిటీ రోడ్‌మ్యాప్‌కు బుధవారం BIMSTEC ఆమోదం తెలిపింది. సమావేశంలో BIMSTEC భద్రతకు భారతదేశ సహకారాన్ని గుర్తిస్తూ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సభ్య దేశాల నాయకులు నాయకత్వ బాధ్యతను ఇండియాకు అప్పగించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘బంగాళాఖాతాన్ని కనెక్టివిటీ(Connectivity), ప్రాస్పరిటీ, సెక్యూరిటీకి కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది. భద్రత లేకుండా అభివృద్ధి, శ్రేయస్సు సాధించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. BIMSTEC సెక్రటేరియట్ ఆపరేషనల్ బడ్జెట్(Budget) కోసం వన్ మిలియన్ యూఎస్ డాలర్లు, సభ్య దేశాల్లో ఉష్ణోగ్రతలు, వాతావరణం సంబంధిత అవసరాలకు మరో మూడు మిలియన్ల యూఎస్ డాలర్లను మోదీ ప్రకటించారు. యూరప్‌లో చోటుచేసుకొన్న పరిస్థితులు అంతర్జాతీయ చట్టాలపై, సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తాయని, ఈ సందర్భంగా BIMSTEC ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, మన ప్రాంతీయ భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరంగా భావిస్తున్నట్లు మోదీ అన్నారు. ఉక్రెయిన్ పేరును ప్రస్తావించకుండానే ఆయన ప్రసంగించడం గమనార్హం.
SAARC (South Asian Association for Regional Cooperation) ఆధ్వర్యంలోని కార్యక్రమాలు వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు కాబట్టి, BIMSTECని ప్రాంతీయ సహకారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా మార్చడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. భారతదేశంతో పాటు, BIMSTECలో శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి. BIMSTEC స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై వేగవంతమైన పురోగతికి మోదీ పిలుపునిచ్చారు. సభ్య దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక ఏకీకరణను సాధించడానికి, వాణిజ్య సౌలభ్యం కోసం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
బంగాళాఖాతంలో 'కోస్టల్ షిప్పింగ్ ఎకో-సిస్టమ్'ని ఏర్పాటు చేయడానికి త్వరలో చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ తెలిపారు. విద్యుత్ గ్రిడ్ ఇంటర్‌కనెక్టివిటీని అమలు చేయడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రహదారి కనెక్టివిటీని పెంచడానికి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కూడా చాలా ముఖ్యమని మోదీ అభిప్రాయపడ్డారు.
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన సమ్మిట్‌లో.. పరస్పర న్యాయ సహాయ ఒప్పందాన్ని (MLAT) ఖరారు చేశారు. కొలంబోలో సాంకేతికత బదిలీకి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, దౌత్య అకాడమీల మధ్య సహకారాన్ని సులభతరం చేయాలని నిర్ణయించారు. శిఖరాగ్ర సమావేశం ముగిసిన కొద్దిసేపటికే.. BIMSTEC ఒప్పందాలను అంగీకరించడంతో సమ్మిట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
MEA అదనపు కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘BIMSTEC ఒప్పందాలపై సంతకం చేయడం, రవాణా కనెక్టివిటీ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడం సమ్మిట్‌లో ప్రధాన అంశాలు. ఇకమీదట, BIMSTEC సహకార కార్యకలాపాలు ఏడు దేశాల సమన్వయంతో జరుగుతాయి. ఏడు దేశాల భద్రతకు భారత్ నాయకత్వం వహిస్తుంది. కనెక్టివిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, మెరైన్ కోపరేషన్, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంశాల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు.
సహకార కార్యకలాపాలు విజయవంతమవడానికి అన్ని దేశాలు హాజరుకావాలని కోరుతున్నాం. BIMSTECలో మయన్మార్ కీలకం. BIMSTEC ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ధి చేయడానికి భారతదేశం నిబద్ధత దృష్ట్యా, మోదీ కొన్ని భారతీయ కార్యక్రమాలపై ప్రకటనలు చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఇది BIMSTEC ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.