news18-telugu
Updated: May 29, 2019, 10:47 PM IST
నరేంద్రమోదీ, అమిత్ షా (File)
కొత్త కేబినేట్ కూర్పు కోసం మోదీ, అమిత్ షా ద్వయం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. రాజకీయ సమీకరణలు, కొత్త నేతలకు అవకాశాలు, సమర్థత, లక్ష్యాలు ఇలా పలు అంశాల ప్రతిపదికగా కేబినేట్ కూర్పు ఉండబోతోందని చర్చ జరుగుతోంది. అయితే అర్థరాత్రి వరకూ ఈ చర్చలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రేపు ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. దీంతో పలువురు నేతలు తమకు ఎప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందా అనే ఉత్కంఠతో ఉన్నట్లు తేలింది. దీంతో ఫోన్ కోసం రాత్రంతా బీజేపీ సీనియర్లు, ఎంపీలు ఎదురుచూసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కొత్త మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పించనున్నారు అనే అంశంపై గోప్యత పాటిస్తున్నారని, ఫోన్ అందుకున్న నేతలకు తమకు మంత్రి పదవులు వచ్చాయనే సమాచారం లీక్ చేయకూడదని స్ట్రిక్ట్ సూచనలు వస్తున్నాయి. ఫోన్ అందుకున్న వారంతా రేపు ఉదయం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను నేరుగా కలవాలని సూచించారు. అలాగే ఎన్డీఏ మిత్ర పక్షాల్లో ఎవరికి పదవులు ఇవ్వాలనే అంశంపై కూడా మోదీ, అమిత్ షాల నిర్ణయమే ఫైనల్ అని అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ రేపు రోజంతా బిజీగా గడపనున్నారు. ఉదయం ఏడు గంటలకు రాజ్ ఘాట్ లో మహాత్మునికి నివాళితోపాటు, దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ కి నివాళి అర్పించనున్నారు. అనంతరం మోదీ పార్టీలోని కీలక వ్యక్తులతో మంత్రివర్గం కూర్పుపై చర్చించనున్నారు.
First published:
May 29, 2019, 10:47 PM IST