కాలేజీలు, యూనివర్సిటీల్లో సెల్ ఫోన్లు బంద్.. ‘సీఎం’ సంచలన నిర్ణయం

కాలేజీకి వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు, టీచర్లు సెల్ ఫోన్లో కాలం గడిపేస్తున్నారని, చదువు అటకెక్కుతుందనే అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

news18-telugu
Updated: October 18, 2019, 4:03 PM IST
కాలేజీలు, యూనివర్సిటీల్లో సెల్ ఫోన్లు బంద్.. ‘సీఎం’ సంచలన నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 18, 2019, 4:03 PM IST
రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో సెల్ ఫోన్లను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూపీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యురల్ జారీ చేసింది. కాలేజీలు, యూనివర్సిటీల్లో అసలు సెల్ ఫోన్ అనేదే కనిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధన విద్యార్థులకు మాత్రమే కాదు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు కూడా వర్తిస్తుంది. స్టూడెంట్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ ఎవరూ కాలేజీలు, యూనివర్సిటీల్లో సెల్ ఫోన్లు వినియోగించకూడదు. ‘రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగు పరచడానికి, చదువుకునేందుకు మంచి వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.’ అని ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రకటించింది.

కాలేజీకి వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు, టీచర్లు సెల్ ఫోన్లో కాలం గడిపేస్తున్నారని, చదువు అటకెక్కుతుందనే అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ సమావేశాలు, అధికారులతో సమీక్షలకు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురావొద్దని ఆదేశాలు ఇచ్చారు. సీఎంతో సమీక్ష సమయంలో కొందరు మంత్రులు, అధికారులు సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్‌లు చూసుకుంటున్నారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...