#MeToo: నానా పటేకర్‌ ఆ టైపు కాదు: రాజ్ థాకరే

ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే మీటూ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారేమోనని రాజ్ థాకరే అనుమానం వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: October 18, 2018, 2:07 PM IST
#MeToo: నానా పటేకర్‌ ఆ టైపు కాదు: రాజ్ థాకరే
నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్త
  • Share this:
‘మీ టూ’ వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌‌ను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే వెనకేసుకొచ్చారు. నానా పటేకర్ అమర్యాదస్తుడే కానీ, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తి కాదని ఆయన చెప్పుకొచ్చారు. 2008లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త ఇటీవల సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్త ఆరోపణలపై స్పందించిన రాజ్ థాకరే..తనకు నానా పటేకర్‌ గురించి తెలుసని, ఆయన అమర్యాదస్తుడేకానీ..ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే రకం కాదని వ్యాఖ్యానించారు.

ఏదేమైనా మీటూ చాలా సున్నితమైన అంశం. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లింది. కోర్టులో నిజానిజాలు బయటపడతాయి. ఈ వివాదంలో మీడియాకు సంబంధమేంటి? ’మీ టూ’ ట్విట్టర్‌లో చర్చించాల్సిన అంశం కాదు.
రాజ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్


మీ టూ చర్చ వెనుక కుట్ర!
సున్నితమైన ‘మీ టూ’ వివాదం సోషల్ మీడియాలో చర్చించాల్సిన అంశంకాదన్నారు రాజ్ థాకరే. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే మీటూ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, రూపాయి మారక విలువ పడిపోవడం నుంచి దృష్టి మళ్లించడానికే ‘మీటూ’పై సోషల్ మీడియాలో చర్చను ఉధృతం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.

ఏ మహిళకైనా సమస్య వస్తే ఎంఎన్‌ఎస్‌ను ఆశ్రయించవచ్చని...తాము తప్పకుండా సాయం చేస్తామన్నారు. నిందితులకు బుద్ధి చెప్తామన్నారు. ఇతరుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అప్పటికప్పుడే సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. పదేళ్ల తర్వాత చెబితే నమ్మడానికే చాలా సమయం పడుతుందని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు.
Published by: Janardhan V
First published: October 18, 2018, 2:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading