నేడు హర్యానా సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం

Haryana Government : హర్యానాలో అనిశ్చితికి చెక్ పడింది. అధికార బీజేపీ సహా ఏ పార్టీకీ మెజార్టీ దక్కకపోవడంతో... జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

news18-telugu
Updated: October 27, 2019, 5:36 AM IST
నేడు హర్యానా సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం
గవర్నర్‌తో ఖట్టర్, దుష్యంత్
  • Share this:
Haryana Government : హర్యానాలో ఈసారి హంగ్ సర్కార్ రాబోతోంది. మెజార్టీ సీట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీ... జననాయక్ జనతా పార్టీ (JJP)తో కలిసి... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం గవర్నర్‌ సత్యదేవ్‌ను కోరడం, ఆయన ఓకే చెప్పడం అన్నీ అయిపోయాయి. అందువల్ల ఇవాళ మరోసారి సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా JJP అధినేత దుథ్యంత్ చౌతాలా ప్రమాణం చేస్తారు. నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. నెక్ట్స్ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. కొందరు మంత్రుల పేర్లను ఇవాళ ప్రకటిస్తారని తెలిసింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ - జేజేపీ కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ తెలిపారు.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు, ఇతరులు మిగతా 10 సీట్లు గెలిచారు. తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. అయితే, ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది. అయినప్పటికీ స్వతంత్రుల మద్దతు బీజేపీకి కొనసాగనుంది.

Pics : క్యూట్ స్మైల్ బ్యూటీ కనిహ లేటెస్ట్ స్టిల్స్

ఇవి కూడా చదవండి :

Diwali 2019 : అంతటా దీపావళి సందడి... సెలబ్రిటీల విషెస్


Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : కాన్సర్‌కి గుమ్మడికాయతో చెక్... ఇవీ ప్రయోజనాలు
Published by: Krishna Kumar N
First published: October 27, 2019, 5:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading