MK STALIN LED TAMIL NADU GOVT ISSUES ORDER GRANTING WEEKLY OFF FOR POLICE PERSONNEL MKS
ys jagan బాటలో MK Stalin -పోలీసులు అందరికీ వీక్లీ ఆఫ్ -Tamil Nadu సర్కారు జీవో
తమిళనాడు సీఎం స్టాలిన్
పోలీసులకు వీక్లీ ఆఫ్స్ అమలుచేస్తోన్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా, జగన్ విధానాన్ని ఎంకే స్టాలిన్ సైతం ఫాలో అయ్యారు. పోలీసులకు వీక్లీ ఆఫ్స్ విధానాన్ని అమల్లోకి తెస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. సీఎం స్టాలిన్ గత నెలలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నెల తిరిగేలోపే అమలులోకి తీసుకొచ్చారు..
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో ఉద్యోగులకు వారాంతపు సెలవులు ఉన్నా.. ఒక్క పోలీస్ శాఖలో మాత్రం బ్రిటిష్ కాలం నాటి చట్టాలే కొనసాగుతూ, బండచాకిరీ కొనసాగుతోన్న వైనం క్రమంగా మారుతోంది. శాంతిభద్రత పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసులు పని ఒత్తిడికి గురవుతూ, మానసికంగా కుంగుబాటుకులోనవుతోన్న నేపథ్యంలో వారికీ వారాంతపు సెలవులు ఉండాల్సిందేనని పలు రిపోర్టులూ సూచించాయి. ఆ దిశగా పోలీసులకు వీక్లీ ఆఫ్స్ అమలుచేస్తోన్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా, ఇప్పుడు తమిళనాడులోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్స్ జీవో జారీ అయింది..
పోలీసులకు వీక్లీ ఆఫ్స్ విధానాన్ని అమల్లోకి తెస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. పోలీసులకు వీక్లీ ఆఫ్స్ ఇస్తామని సీఎం ఎంకే స్టాలిన్ గత నెలలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నెల తిరిగేలోపే అమలులోకి తీసుకొచ్చారు. పోలీసులకు వారాంతపు సెలవులపై తమిళనాడు హోం శాఖ ముఖ్యకార్యదర్శి పేరుతో జీవో జారీ అయింది. ఆయా జిల్లాల్లో సిబ్బంది సంఖ్యను బట్టి, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందరికీ కచ్చితంగా సెలవులు దక్కే విధానాన్ని అవలంబించాలని జీవోలో పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో సీఐ నుంచి ఎస్సై, కానిస్టేబుళ్లు, హోం గార్డులపై విపరీతమైన పని ఒత్తిడి ఉంటుండం, వారంతా రోజుకు 18 గంటలుపైగా పని చేస్తుండటం చాలా రాష్ట్రాల్లో జరిగేదే. దీని వల్ల పోలీసుల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావానికి గురవుతున్నట్లు రిపోర్టులు వెలువడగా, దేశంలోనే తొలిసారి ఏపీ సర్కారు పోలీసులకు వీక్లీ ఆఫ్స్ అమలులోకి తీసుకొచ్చింది. ఈ పని చేసిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తెలంగాణలోనూ రెండేళ్ల కిందట కొన్ని జిల్లాల్లో పోలీకులకు వీక్లీ ఆఫ్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. కానీ అప్పట్లో ఎన్నికలు రావడంతో మళ్లీ కథ షరామామూలు అయిపోయింది.
తమిళనాడు ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో మొత్తం 1లక్షా 932మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లలో దాదాపు 98 వేల మందికి ఇకపై వీక్లీ ఆఫ్స్ దక్కనున్నాయి. ఒకవేళ వీక్లీ ఆఫ్ రోజున డ్యూటీ చేయాల్సి వస్తే దానిని అదనపు పనిగా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.