#MeToo: కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్‌ రాజీనామా

మహిళా జర్నలిస్టులు సహా పలువురు మహిళలను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.

news18-telugu
Updated: October 17, 2018, 6:24 PM IST
#MeToo: కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్‌ రాజీనామా
న్యూస్ 18 క్రియేటివ్
news18-telugu
Updated: October 17, 2018, 6:24 PM IST
మీటూ ఉద్యమం దెబ్బకు తొలి వికెట్ పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. పలు మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించాడని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ముందుగా ప్రియరమణి అనే జర్నలిస్టు ఆయనపై ట్విటర్‌ ద్వారా  లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో అక్బర్‌ బాధితులు దాదాపు 20 మంది మీటూ అంటూ మీడియా వచ్చి అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చిన ఎంకే అక్బర్...తన ప్రతిష్టంకు భంగం కలిగించేందుకే ,అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ రకమైన ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఇప్పటికే తనపై వేధింపుల ఆరోపణలు చేసిన ప్రియ రమణిపై పరువునష్టం దావా వేసిన ఎంజే అక్బర్...తన పదవికి రాజీనామా చేశారు.





మరోవైపు ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయడం పట్ల ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మొదటి మహిళ ప్రియరమణి హర్షం వ్యక్తం చేశారు. కోర్టులో న్యాయం జరిగే రోజు కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.

మీటూ ఉద్యం భారత రాజకీయ రంగంతో పాటు మీడియా, సినిమా, కార్పొరేట్ రంగాలను కూడా కుదిపేస్తోంది. నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత #మీటూ ఉద్యమం ఊపందుకుంది. సినిమా రంగం నుంచి వివిధ రంగాలకు పాకింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మీద ఆరోపణలు వచ్చాయి. జర్నలిస్ట్ ప్రియారమణి.. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మీద ఆరోపణలు చేశారు. ‘ఆయన నన్ను హోటల్‌కి పిలిచారు. బెడ్ మీద కూర్చోమన్నారు.’ అని ఆరోపించారు. అయితే, ఆమెను ఎంజే అక్బర్ ఏమీ చేయలేదన్న విషయం ప్రియా రమణినే చెప్పిందని పరువునష్టం దావా పిటిషన్‌లో అక్బర్ తరఫు న్యాయవాదులు చెప్పారు. అక్బర్ ప్రియరమణిపై వేసిన కేసుపై ఢిల్లీ పాటియాలా కోర్టులో గురువారం విచారణ జరగనుంది.
First published: October 17, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...