పరస్పర అంగీకారంతోనే సంబంధం..రేప్ ఆరోపణలు అవాస్తవం: అక్బర్

గతంలో తమ మధ్య సంబంధమున్న మాట వాస్తవమేనని..కానీ రేప్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టంచేశారు. వాషింగ్టన్ పోస్ట్ కథనంలో తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు.

news18-telugu
Updated: November 2, 2018, 7:10 PM IST
పరస్పర అంగీకారంతోనే సంబంధం..రేప్ ఆరోపణలు అవాస్తవం: అక్బర్
ఎంజే అక్బర్
  • Share this:
మీటూ ఉద్యమం కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్‌ను మరోసారి చిక్కుల్లో పడేసింది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఇండో అమెరికన్ జర్నలిస్ట్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. దాంతో అక్బర్ వ్యవహారంపై మరోసారి ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రేప్ ఆరోపణలపై స్వయంగా అక్బర్ స్పందించారు. గతంలో తమ మధ్య సంబంధమున్న మాట వాస్తవమేనని..కానీ రేప్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టంచేశారు. వాషింగ్టన్ పోస్ట్ కథనంలో తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు.

1994లో ప్రారంభమైన మా బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. దీని గురించి అందరికీ తెలుసు. దాంతో మా ఇంట్లోనూ కొంత గొడవలు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మా బంధం ముగిసింది. ఐతే అది ప్రశాంతంగా ముగియలేదు. నేను ఆమెపై అత్యాచారం చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌లో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమైంది.
ఎంజే అక్బర్
20 ఏళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కాపురంలో చిచ్చుపెట్టింది. రాత్రి పూట నా భర్తకు ఆమె ఫోన్ చేసేది. అందరి ముందే ఆయనపై ప్రేమ చూపించేది. వారి బంధం గురించి అప్పుడే అర్థమైంది. ఈ విషయంలో మా మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. ఐతే చివరకు నా భర్తలో మారిపోయారు. పల్లవి ఇప్పుడు ఎందుకు అసత్యాలను ప్రచారం చేస్తోందో అర్ధమవడం లేదు.
మల్లికా అక్బర్, ఎంజే అక్బర్ భార్య

కాగా, వాషింగ్టన్ పత్రికకు రాసిన వ్యాసంలో పల్లవి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్‌పీఆర్)కి చీఫ్ బిజినెస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న పల్లవి గొగొయ్.. అక్బర్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరంగా రాశారు. 1994లో ఓ వార్తా కథనాన్ని కవర్ చేయడానికి ఢిల్లీకి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామానికి వెళ్లానని.. ఆ సందర్భంలో అక్బర్ చేత రేప్‌కు గురయ్యానని పల్లవి వెల్లడించారు. మీ టూ ఉద్యమంలో అక్బర్ పలువురు జర్నలిస్టులు ఆరోపణంలో చేయడంతో ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

First published: November 2, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...