#MeToo: లైంగిక ఆరోపణల వెనుక కుట్ర ఉంది- ఎంజే అక్బర్

తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే.. ఇలాంటి అసత్య ఆరోపణలను సృష్టిస్తున్నారని తిప్పికొట్టారు. వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: October 14, 2018, 7:05 PM IST
#MeToo: లైంగిక ఆరోపణల వెనుక కుట్ర ఉంది- ఎంజే అక్బర్
ఎంజే అక్బర్, కేంద్రమంత్రి (ఫైల్ ఫొటో)
  • Share this:
#MeToo సుడిగుండంలో  చిక్కుకున్న కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ఎట్టకేలకు స్పందించారు. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆయన.. చివరకు నోరు విప్పారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే.. ఇలాంటి అసత్య ఆరోపణలను సృష్టిస్తున్నారని తిప్పికొట్టారు. దీని వెనక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు అక్బర్ రాజీనామాపై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకోవట్లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం.

నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. అసూయతోనే నాపై నిందలు వేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఈ మధ్య వైరల్ ఫీవర్‌గా మారింది. ఏదేమైనా..నేను ఇండియాకు తిరిగొచ్చాను. నాపై వస్తున్న నిరాధార ఆరోపణలను మా లాయర్లు దృష్టిసారించారు. ఆరోపనలు చేసిన జర్నలిస్టులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.
ఎంజే అక్బర్, కేంద్రమంత్రి


మీటూ ఉద్యమం దుమారం రేపుతున్న సమయంలో..కొందరు మహిళా జర్నలిస్టులు ఎంజే అక్బర్‌పై సంచలనం ఆరోపణలు చేశారు. అక్బర్ లైంగికంగా వేధించారని మొదట ప్రియారమణి ఆరోపించింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె గత ఏడాదే బయటపెట్టింది. వోగ్ ఇండియాలో దీనిపై అప్పట్లోనే ఆమె ఓ ఆర్టికల్ రాసినప్పటికీ.. అక్బర్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించానని మాత్రమే ఆరోపించారు. ఐతే ఇప్పుడు మీటూ ఉద్యమం నేపథ్యంలో అక్బర్ పేరును బయటపెడుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

నాకూ ఇలాంటి అనుభమే ఎదరయిందని..మరో జర్నలిస్ట్ శుమా రహా ట్విటర్‌లో ఆరోపణలు చేశారు. 1995లో ఏషియన్ ఏజ్ సంస్థలో జాబ్ కోసం తాజ్ బెంగాల్ హోటల్‌ (కోల్‌కతా)లో ఇంటర్వ్యూకు పిలిచారని..ఆ సమయలో తనతో అక్బర్ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. 1995లో ఈ ఘటన జరిగిందని ట్విటర్‌లో పేర్కొన్నారు.
మరో మహిళా జర్నలిస్ట్ ప్రేరణా సింగ్ బింద్రా సైతం అక్బర్‌పై ఆరోపణలు చేశారు. ఆఫీస్ అంశాలపై చర్చించేందుకు ఓ హోటల్‌కు పిలిచి లైంగికంగా వేధించాడని ట్విటర్‌లో మండిపడ్డారు. 17 ఏళ్ల కిందట ఇది జరిగిందని..తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ట్వీట్ చేశారు.



ఎంజే అక్బర్ గతంలో పలు వార్తా సంస్థల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ది టెలిగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి వార్తా సంస్థల్లో ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. ఐతే మీటూ ఆరోపణల నేపథ్యలో ఎంజే అక్బర్ రాజీనామా చేయాలని..దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 14, 2018, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading