పెట్రోల్, డీజిల్‌పై పరిమితులు.. అక్కడ అంతకుమించి పోయరు..

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే చాలా పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో నో స్టాక్స్ బోర్డులు కనిపిస్తున్నాయి.

 • Share this:
  పెట్రోల్, డీజిల్‌పై మిజోరాం ప్రభుత్వం పరిమితి విధించింది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత నెలకొనడంతో వాహనాలకు పరిమిత పరిమాణంలోనే ఇంధనం పోస్తున్నారు. స్కూటర్లకు 3 లీటర్లు, ఇతర ద్విచక్ర వాహనాలకు 5 లీటర్లు, లైట్ మోటార్ వాహనాలకు 10 లీటర్లు, మాక్సి క్యాబ్స్‌, పికప్ ట్రక్స్, మిని ట్రక్స్, జిప్సీ, ట్రక్కులకు 20 లీటర్లు, సిటీ బస్సులు, మీడియం ట్రక్కులకు 100 లీటర్లకు మించి పెట్రోల్, డీజిల్ పోయరు. ఐతే బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలను తరలించే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

  మిజోరాం రాజధాని ఐజ్వాల్ బైపాస్ రోడ్డులో ఉన్న మాంఘవత్లిర్, సెథాన్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి రాకపోకలను నిషేధించారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ను తరలించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ ప్రభావంపై రాష్ట్రమంతటా పడింది. ఇప్పటికే చాలా పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో నో స్టాక్స్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని చోట్ల పెట్రోల్ బంక్‌ల ముందు వాహనాలు క్యూ కట్టాయి. ఐతే బ్లాక్‌లో ఎక్కువ రేటుకు అమ్ముతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

  కాగా, మిజోరాంలో ఇప్పటి వరకు 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 323 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మిజోరాంలో 300 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు.
  Published by:Shiva Kumar Addula
  First published: