దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో రిపబ్లిక్ డే వేడుకల కోలాహలం నెలకొంది. పరేడ్స్, శకటాల ప్రదర్శన, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలతో అన్ని రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఈశాన్యం రాష్ట్రం మిజోరంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడి ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను బాయ్‌కాట్ చేశారు.
సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని, సంక్షేమ అభివృద్ది పథకాల విషయంలో దేశ సరిహద్దును ఆనుకుని నివసిస్తున్న ప్రజలకు ప్రాధాన్యతనిస్తామని గవర్నర్ చెప్పారు. పౌరసత్వ ముసాయిదా బిల్లుకు ఆమోదం నేపథ్యంలో.. మిజోరాం సాంప్రదాయాలకు, స్థానిక అస్థిత్వానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని తెలిపారు.దేశవ్యాప్తంగా ఉన్న మిజో ప్రజలందరి మధ్య సోదరభావం నెలకొనేలా.. వారంతా ఐక్యంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దేశంలోనే క్లీనెస్ట్ రాష్ట్రంగా పేరున్న మిజోరాంకు ఉన్న ఇమేజ్ను కాపాడుతామని తెలిపారు.
కాగా, జనవరి 7న పౌరసత్వ ముసాయిదా బిల్లుకు మోదీ నేత్రుత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ముసాయిదా ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది. వారు ఎక్కడినుంచి వచ్చినవారైనప్పటికీ.. ఆరేళ్లుగా భారత్‌లో స్థిరంగా నివసిస్తున్నవారైతే వారికి పౌరసత్వం ఇవ్వాలని ఈ ముసాయిదా సూచిస్తోంది. అయితే వలసదారులకు పౌరసత్వం లభిస్తే మిజోరాం అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే వేడుకలను వారు బాయ్‌కాట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mizoram, Republic Day 2019