మిజోరాం (Mizoram). ఈశాన్య రాష్ట్రాల్లో అందమైన ప్రదేశం. అయితే మిజోరాం రాష్ట్రం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఎవరూ చేయని కంప్లైంట్ ఆ రాష్ట్రం నుంచి వచ్చింది. తమ దగ్గర పనిచేసే ఆఫీసర్‌కి తమ భాష రాదని, ఆ ఆఫీసర్ భాష తమకు రావడం లేదని ఏకంగా కేంద్ర హోం మంత్రి (Union Home minster)కి లెటర్ రాశారు. అయితే ఇక్కడ లెటర్ రాసింది కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. మిజోరాం ముఖ్యమంత్రి (Mizoram Chief minister) . ఆ ఫిర్యాదు కూడా చేసింది సామాన్య వ్యక్తిపై కాదు మిజోరాం చీఫ్ సెక్రటరీపై. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం వివాదస్పదంగా మారింది. కొత్త సీఎస్‌గా రేణు శర్మ (Renu Sharma)ని అపాయింట్ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ (Zoramthanga అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కేబినెట్ మంత్రులకు (cabinet ministers) హిందీ (hindi) తెలియదని, ఇంగ్లిష్ (English) కూడా అర్థం చేసుకోలేరని, అందుకే మిజో భాష తెలిసిన వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే మించిదన్నారు. ప్రస్తుత అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగ (JC Ranthanga)ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah)ను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief secretary) లాల్నున్మవియా చువావుగో పదవీ విరమణ చేసిన తర్వాత, ప్రస్తుత అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కోరానని ముఖ్యమంత్రి ప్యూ జోరంతంగ (Zoramthanga) తెలిపారు. ఈ మేరక కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ.. ఓ లేఖను అమిత్ షాకు రాశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేణు శర్మను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తన కేబినెట్ మంత్రులకు హిందీ (Hindi) భాష తెలియదని, ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోలేరని సీఎం జోరంతంగ పేర్కొన్నారు. మాతృ భాష తెలిసిన వారిని నియమిస్తే మంచిదన్నారు. మిజో భాష (Mizo language) తెలియని వ్యక్తిని సీఎస్‌గా నియమిస్తే.. సమర్థవంతంగా, ప్రభావంతంగా పనిచేయలేరన్నారు. మిజోరం రాష్ట్ర ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతుందని, అందుకే మిజో భాష తెలిసిన వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఆయన లేఖలో కోరారు.
ఈ లేఖ (letter)ను అక్టోబరు 29న పంపించినట్లు ముఖ్యమంత్రి సలహాదారు ప్యూ సీ లాల్రంజవువా తెలిపారు. రేణు శర్మకు కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 28న ఆదేశాలు ఇచ్చింది. నవంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ అదే రోజు మిజోరాం ప్రభుత్వం కూడా ఓ ఆర్డర్ (order) జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నవంబరు 1 నుంచి బాధ్యతలను నిర్వహించాలని జేసీ రంతంగను ఆదేశించింది.
ఎన్డీయే విశ్వాస భాగస్వాముల్లో తాను కూడా ఒకరినని..
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే విశ్వాస భాగస్వాముల్లో తాను కూడా ఒకరినని, అందువల్ల తన అభ్యర్థనను మన్నించి, సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఈ లేఖను అమిత్ షాకు గత 29న రాయగా, తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సీఎం రాసిన లేఖపై కేంద్రం ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.