#MissionPani : ప్రతీ ఒక్కరిలో ఆ చైతన్యం రావాలి : అమీర్ ఖాన్

Amir Khan Exclusive on MissionPani : భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు అమీర్. మహారాష్ట్రలోని ప్రతీ గ్రామం తాగునీటి పరిరక్షణపై చైతన్యమైతే.. ఓ గొప్ప మార్పు తీసుకురావచ్చునని అన్నారు.

Srinivas Mittapalli | news18-telugu
Updated: July 3, 2019, 4:15 PM IST
#MissionPani : ప్రతీ ఒక్కరిలో ఆ చైతన్యం రావాలి : అమీర్ ఖాన్
న్యూస్18 ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్..
Srinivas Mittapalli | news18-telugu
Updated: July 3, 2019, 4:15 PM IST
దేశంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించి నీటి పరిరక్షణ దిశగా అడుగులు వేయాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ చేపట్టిన #MissionPani క్యాంపెయిన్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మద్దతుగా నిలిచారు. ప్రస్తుత తరుణంలో మిషన్ పానీ కార్యక్రమం అత్యంత ఆవశ్యకమైనదని తెలిపారు. సత్యమేవ జయతే షో నిర్వహిస్తున్నప్పుడు.. భవిష్యత్తులో తాగునీటి పరిరక్షణ కోసం ఏదైనా చేయాలని అనుకునేవాళ్లమని చెప్పారు. అనుకున్నట్టుగానే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దాన్ని చేపట్టామని తెలిపారు. తాగునీటి పరిరక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతనివ్వాల్సిన విషయమని.. మరీ ముఖ్యంగా వర్షపాతం తక్కువగా ఉండేప్రాంతాల్లో దీనిపై మరింత అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.'న్యూస్18'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ ఈ విషయాలు వెల్లడించారు.

భూగర్భ జలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు అమీర్. మహారాష్ట్రలోని ప్రతీ గ్రామం తాగునీటి పరిరక్షణపై చైతన్యమైతే.. ఓ గొప్ప మార్పు తీసుకురావచ్చునని అన్నారు.దీన్నో బృహత్తర కార్యక్రమంగా.. ఓ మహత్తర ఉద్యమంగా జనాల్లోకి తీసుకెళ్లగలిగితే తప్ప మార్పు సాధ్యపడదన్నారు. బడ్జెట్‌లో నీటి పరిరక్షణ కోసం నిధులు వెచ్చించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ముంబై లాంటి ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతున్నప్పటికీ.. ఆ నీరంతా వృథాగా పోతుందన్నారు. ఇంకుడు గుంతల ద్వారా నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని ఉపయోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు.

First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...