#MissionPaani | జలశక్తి అభియాన్ ప్రయత్నానికి బిగ్ బీ, అమీర్ ఖాన్ ప్రశంస...

#MissionPaani | ప్రముఖ బాలివుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ లు తమ ట్విట్టర్ ద్వారా జలశక్తి అభియాన్ ప్రయత్నాన్ని శ్లాఘించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ చేపట్టాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని ఇరువురు పేర్కొన్నారు. కాగా అమితాబ్, ఆమీర్ ఖాన్ ట్వీట్లపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇరువురి నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు.

news18-telugu
Updated: July 1, 2019, 7:52 PM IST
#MissionPaani | జలశక్తి అభియాన్ ప్రయత్నానికి బిగ్ బీ, అమీర్ ఖాన్ ప్రశంస...
ప్రధాని మోదీ, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్
  • Share this:
దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి సమస్య ఉన్న ప్రాంతాల్లో సమర్థ నీటి నిర్వహణ అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జలశక్తి అభియాన్ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ బాలివుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ లు తమ ట్విట్టర్ ద్వారా జలశక్తి అభియాన్ ప్రయత్నాన్ని శ్లాఘించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ చేపట్టాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని ఇరువురు పేర్కొన్నారు. కాగా అమితాబ్, ఆమీర్ ఖాన్ ట్వీట్లపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇరువురి నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధానంగా దేశంలోని తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జల సంరక్షణ, నీటి పారుదల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టేందుకు జల శక్తి అభియాన్ తోడ్పడనుంది. ఇప్పటికే దేశంలని 255 జిల్లాల్లోని 1092 బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించామన్నారు.

 





First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు