Home /News /national /

MISSION PAANI WOMEN BEAR THE BRUNT OF INDIAS WATER CRISIS NS

Mission Paani: దేశంలోని నీటి కష్టాలకు సమిధలవుతున్న మహిళలు.. ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనలో చాలా మందికి నీటి కష్టం గురించి తెలియనే తెలీదు. కానీ ఇప్పటికీ మనలో చాలా మంది నీటి కోసం కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లోని మహిళలు నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి.

  మనలో చాలా మందికి నీరు అంటే పెద్ద విషయమేమి కాదు. జస్ట్ కుళాయిని ఆన్ చేస్తే కావాల్సినంత సులభంగా పొందుతాం. కానీ ప్రపంచ జనాభాలో చాలా మందికి నీరు సులభంగా పొందడం ఇప్పటికీ అందని ద్రాక్ష. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలకు చెందిన వారు ఇప్పటికీ తాగే నీటి కోసం నదులు, ప్రవాహాలు, బావులు మరియు ఇతర నీటి వనరులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. కుటుంబానికి అవసరమైన నీటిని సేకరించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా తాగునీటి కోసం గంటల తరబడి వెచ్చించే మహిళల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ గృహావసరాల కోసం నీటిని పొందడం అనేది యుగయుగాలుగా స్త్రీ యొక్క పనిగా మారింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు నీటిని పొందడానికి అనేక కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి.

  జాతీయ మహిళా కమిషన్(NCW) నివేదిక ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరులను చేరుకోవడానికి మహిళలు ఇప్పటికీ సగటున 2.5 కి.మీ వరకు నడిచి వెళతారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుండి 2017 డేటా ప్రకారం.. భారతదేశంలోని దాదాపు 256 జిల్లాలు భయంకరమైన భూగర్భజల స్థాయిలను నమోదు చేశాయి. రానున్న సంవత్సరాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో ఈ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారనుంది. మెజారిటీ గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా త్రాగే నీరు అందుబాటులో లేదు. దీంతో వారు అపరిశుభ్రమైన నీటి వనరులపై ఆధారపడి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ పరిస్థితి మెరుగ్గా లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఉదాహరణకు, బెంగుళూరులో వారానికి రెండుసార్లు నీరు సరఫరా చేయబడుతుంది. చెన్నై దాహం తీర్చడానికి 250 ట్యాంకర్లు 2,250 ట్రిప్పులు తిరుగుతాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు మూడు రోజులకు ఒకసారి నీరు వస్తుంది.

  గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సగటున రోజుకు 3-4 గంటలు తమ కుటుంబాలకు తాగునీటి కోసం వెచ్చిస్తున్నారు. ఈ కీలకమైన సమయాన్ని ఆర్థిక కార్యకలాపాలకు లేదా విద్యను పొందేందుకు వినియోగించుకోవచ్చు. ఇది మహిళలు తమ నిజమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా మరియు సామాజికంగా మరియు ఆర్థికంగా సాధికారత సాధించే అవకాశాలను ఉపయోగించుకోకుండా నిరోధిస్తుంది. NCW అధ్యయనం ప్రకారం.. ఒక గ్రామీణ మహిళ నీటి కోసం సంవత్సరానికి 14,000 కిమీ కంటే ఎక్కువ నడిచి వెళుతుంది. మన దేశంలోని వివిధ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు అంత దూరం నడవకపోయినా.. గంటల తరబడి క్యూలో నిలబడి రోడ్డు పక్కన కుళాయిలు, ట్యాంకర్ల నుంచి నీటిని సేకరిస్తున్నారు.

  సరైన మద్దతు మరియు వేధికను అందించినట్లయితే భారతదేశంలో నీటి భద్రతను నిర్వహించడానికి మహిళలు మంచి స్థానంలో ఉన్నారు. ఉదాహరణకు, జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో, యునిసెఫ్(UNICEF) చొరవతో లావా పంచాయతీలోని 130 గ్రామాల గృహ నీటి అవసరాలను తీర్చడానికి మరియు 450 పంపులను నిర్వహించడానికి కొంతమంది మహిళలు విభిన్న గ్రూప్ లను ఏర్పాటు చేశారు.

  ఇక న్యూస్ 18, హార్పిక్ ఇండియా కలిసి మిషన్ పానీ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది నీటి సంరక్షణ, ప్రజా పరిశుభ్రత అనే రెండు లక్ష్యాలను చేరుకునే దిశగా పనిచేస్తుంది. https://www.news18.com/mission-paani/ లింక్‌పై క్లిక్ చేసి ఈ కార్యక్రమంలో పొల్గొనవచ్చు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Mission paani, News18, Water Crisis, Water problem

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు