హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: ఆ రెండింటి బాధ్యత మనపై ఉంది.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్

Mission Paani: ఆ రెండింటి బాధ్యత మనపై ఉంది.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్

మిషన్ పానీ వాటర్‌థాన్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి హర్షవర్దన్

మిషన్ పానీ వాటర్‌థాన్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి హర్షవర్దన్

దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ వాటర్‌థాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

Mission Paani: మన దేశంలో ఎన్నో జీవనదులు ఉన్నా... చాలా రాష్ట్రాల్లో నీటి కొరత సమస్య ఉంది.మన పూర్వీకులు చెరువుల్లో నీరు డైరెక్టుగా తాగేవాళ్లు. మరి ఇప్పుడో చెరువులే కాదు నదుల్లో నీరు కూడా డైరెక్టుగా తాగే పరిస్థితి లేదు. అన్నీ కలుషితం. దేశమంతా తాగు నీటి కొరత. దీనంతటికీ కారణం ఉన్న నీటిని సరిగా పొదుపు చేసుకోకపోవడమే. కొన్ని ప్రాంతాల్లో నీటికి విపరీతమైన కొరత ఉంటే... మరికొన్ని చోట్ల నీటిని వృథాగా పారబోస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ వాటర్‌థాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది మొత్తం 8 గంటలపాటూ సాగే కార్యక్రమం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీనికి హోస్ట్‌గా ఉన్నారు. ఈ ఉద్యమ అంబాసిడర్గా కూడా ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో "పానీ కీ కహానీ... భారత్కీ జుబానీ" థీమ్తో దేశంలో నీటి కొరత, అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30కి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో దేశంలోని ప్రముఖులు చాలా మంది నీటిని పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయనున్నారు.

ఈ మిషన్ వాటర్‌థాన్‌లో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ నీటి పొదుపు అవశ్యకతను వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా సాంకేతికను ఉపయోగించి దేశంలోని ప్రజలందరికి నీటిని అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. "భూగర్భ జలాలను ఆదా చేయడం మన బాధ్యత. తాగునీటిని పరిశుభ్రంగా ఉంచుకోవవడం కూడా మన బాధ్యతే. కేంద్ర ప్రభుత్వం వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సాంకేతికతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నీటిని అందించడమే దీని లక్ష్యం. మన ప్రతి చిన్న సహకారం మన ఆరోగ్యానికి మరియు దేశం సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది" అని తెలిపారు.

ఈ వాటర్‌థాన్‌లో పాల్గొన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్.. వివిధ ప్రాంతాల్లో నీటి కొరత సమస్యపై ప్రసంగించారు. "నీటి వినియోగాన్ని దాని పరిసర ప్రాంతాలకే పరిమితం చేయాలని ప్రధాని మోదీ ప్రచారం చేశారు. గ్రామాల్లోని నీరు గ్రామాల్లో, పట్టణాల్లోని పట్టణాల్లోనే, వ్యవసాయ నీటిని వ్యవసాయానికే వినియోగించాలి"అని చెప్పారు. సామాజిక మార్పు తీసుకురావడంలో పౌరులు భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చెబుతుంటారని అన్నారు. మిషన్ పానీ పేరుతో న్యూస్ 18 చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

ఇక, మనం కూడా చాలా ఏళ్లుగా నీటి కొరత సమస్యను మనం చూస్తూనే ఉన్నాం. కావేరీ లాంటి నదులు పూర్తిగా ఎండిపోతున్నాయి. క్రమంగా మనం డే జీరోకి వెళ్లిపోతున్నాం. ఆ రోజున మనకు నీరు అన్నదే దొరకదు. అది భయంకరమైన పరిస్థితి. ఇప్పటికే దేశంలోని 15 ప్రధాన నగరాల్లో నీటి కొరత ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి నగరాల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ప్రతి చుక్కా ముఖ్యమే... కానీ మనకు తెలియకుండానే మనం నీటిని వృథా చేస్తూ ఉంటాం. చాలా మంది ట్యాపులు వదిలేసి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈలోగా నీరు వృథా అవుతుంది. నీటిని ఆదా చేయాలనే ఆలోచన మనలోంచీ రావాలి. అందుకే నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

First published:

Tags: Akshay Kumar, Mission paani

ఉత్తమ కథలు