MISSION PAANI WATERTHON UPDATES ESHA DEOL VOWED TO SAVE WATER AT HER PERSONAL LEVEL EVEN WITH HER CHILDREN NK
Mission Paani: మిషన్ పానీ మారథాన్‌లో పాల్గొన్న ఈషా డియోల్... సంచలన ప్రతిజ్ఞ
మిషన్ పానీ మారథాన్‌లో పాల్గొన్న ఈషా డియోల్...
Mission Paani: నీటిని కాపాడేందుకు, తాగునీటిని పొదుపు చేసేందుకు ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అదే మిషన్ పానీ. అందులో భాగంగా జరిగిన మిషన్ పానీ మారథాన్‌లో ప్రముఖులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.
Mission Paani: సినీ నటులు, రాజకీయ నేతలకు నీటి కొరత ఉండదు. నీటిని డబ్బుతో కొనుక్కోగల స్తోమత వారికి ఉంటుంది. కానీ ఓ దశ తర్వాత... డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నా నీరు దొరకదు. 2 ఏళ్ల కిందట చెన్నైలో జరిగింది అదే. మొత్తం నగరమంతా నీటి కొరత వచ్చేసింది. హోటళ్లలో నీరు తప్ప ఏదైనా అడగండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకే... డబ్బు ఉంది కదా అని నీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయాన్ని గ్రహించిన సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు... నీటి పొదుపుపై ఇప్పుడు తమ వంతుగా ముందుకొస్తున్నారు. నీటిని పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. బాలీవుడ్ నటి ఈషా డియోల్ (Esha Deol) కూడా ముంకొచ్చింది. ఓ మంచి ఉద్దేశంతో జరుగుతున్న మిషన్ పానీ మారథాన్‌లో పాల్గొన్న ఆమె... తన వ్యక్తిగతంగా తాను నీటిని ఆదా చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. తనతోపాటూ... తన పిల్లలకు కూడా నీటిని ఎలా పొదుపు చెయ్యాలో నేర్పిస్తానని తెలిపింది. నీరు ఎంత ముఖ్యమైనదో వారికి వివరిస్తానని చెప్పింది.
మిషన్ పానీ మారథాన్‌లో పాల్గొన్న ఈషా డియోల్
దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ మారథాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది మొత్తం 8 గంటలపాటూ సాగే కార్యక్రమం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీనికి హోస్టుగా ఉన్నారు. ఈ ఉద్యమ అంబాసిడర్‌గా కూడా ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో "పానీ కీ కహానీ... భారత్‌కీ జుబానీ" థీమ్‌తో దేశంలో నీటి కొరత, అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30కి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది నీటిని పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
నీటి పొదుపుతోపాటూ... ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాల్సిన అంశంపైనా ఈ ఉద్యమంలో పోరాటం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. లెఫ్టినెట్ కల్నల్ ఎస్జీ దాల్వీ వంటి ఎంతో మంది పరిశుభ్రతపై ప్రచారం కల్పిస్తుంటే... అమలా రుయా వంటివారు... నీటి కొరతపై పోరాడుతున్నారు. ఇలా ఎంతో మంది నీటిని పొదుపు చేయడం ఎలా, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం ఎలా, నీటి లభ్యత పెంచేందుకు ఏం చెయ్యాలి, పరిశుభ్రతను ఎలా పెంచాలి, మురికి వాడల్లో ప్రజలకు మేలైన జీవితాన్ని ఎలా అందించాలి... వంటి అంశాలపై ఈ ఉద్యమం ద్వారా మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తున్నారు.